Advertisement

ఆ వెదవలకు చెబుతున్నా.. నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్

Posted : August 6, 2024 at 2:06 pm IST by ManaTeluguMovies

నిహారిక కొణిదెల నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రోమో మేటీరియల్, టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా స్నేహబంధం ఆధారంగా సాగే కథాంశంతో యువతను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

ఈ సినిమాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యువత మధ్య ఉండే అనుబంధాలను ప్రధానంగా చూపించినట్లు అర్థమవుతోంది. నిజ జీవితంలోని సన్నివేశాలను ఆధారంగా తీసుకొని, స్నేహితుల మధ్య సాగే సన్నివేశాలను చక్కగా తెరకెక్కించారని ట్రైలర్ ద్వారా హైలెట్ అవుతోంది. ఇక సినిమా ప్రమోషన్స్ పిఠాపురం లో కూడా స్టార్ చేశారు. అక్కడ ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలను హైలెట్ చేశాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ పై నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి కౌంటర్ ఇచ్చారు. నాగబాబు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ తప్ప వేరేవారు ఉండరు అనే వాళ్ళను చూశాను, ఆ వెదవలకు చెబుతున్నాను.. మాకు అలాంటి భావన ఉండదు. సినిమా ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తు కాదు.

ఇది మా నాన్న సామ్రాజ్యం కాదు, మా తాత సామ్రాజ్యం కాదు, అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ వారిది కూడా కాదు. సినిమా ఇండస్ట్రీ అందరికీ సంబంధించినది. ఇక్కడ అడివి శేష్ వంటి టాలెంట్ ఉన్న వాళ్లు కూడా రానిస్తున్నారు. వాళ్ల టాలెంట్‌తో పైకి వచ్చారు.. అని చెప్పుకొచ్చారు. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలోని వారి స్థానంపై నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయన చెప్పిన మాటల వీడియో కూడా వైరల్ అవుతోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా మరిన్ని అంచనాలను రేకెత్తిస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా నాగబాబు కామెంట్ల ప్రభావంతో మరింత హైప్ పొందింది. మెగా ఫ్యామిలీ నుండి నిర్మాతగా తొలి ప్రయత్నంలో నిహారిక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.


Advertisement

Recent Random Post:

Jani Master Case : ఎవరికి నచ్చింది వారు రాసుకుంటున్నారు : C. Kalyan

Posted : September 20, 2024 at 1:06 pm IST by ManaTeluguMovies

Jani Master Case : ఎవరికి నచ్చింది వారు రాసుకుంటున్నారు : C. Kalyan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad