Advertisement

ఆ హీరోను ‘కింగ్‌’ అన్న గూగుల్‌

Posted : August 13, 2024 at 6:49 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ కింగ్‌ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియన్ సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా షారుఖ్‌ ఖాన్‌ కి ఎంతో మంది అభిమానులు ఉంటారు. అలాంటి షారుఖ్ ఖాన్‌ ఇటీవల స్విట్జర్లాండ్‌ మీడియా చిట్‌ చాట్ లో తన గురించి తెలియాలి అంటే గూగుల్‌ చేయమని ఒక జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. షారుఖ్ చేసిన వ్యాఖ్యలకు గూగుల్‌ వెంటనే సోషల్‌ మీడియా ఎక్స్ ద్వారా స్పందించడంతో పాటు, షారుఖ్‌ ఖాన్ ను కింగ్ అనే విధంగా కిరీటంను పోస్ట్‌ చేసి ఆయన పేరును ట్యాగ్‌ చేయడం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన 77వ లోకార్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకలో ప్రతిష్టాత్మకమైన పార్డో అల్లా కెరియారా అవార్డును షారుఖ్ ఖాన్‌ అందుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. అత్యంత గౌరవ ప్రధమైన ఈ అవార్డును అందుకున్న షారుఖ్ ఖాన్‌ స్థానిక మీడియాతో ముచ్చటించాడు. నా గురించి తెలియక పోతే గూగుల్‌ లో నా పేరుతో సెర్చ్ చేసి, నా గురించి తెలిసుకున్న తర్వాత, గూగుల్ నా గురించి ఏం చెబుతుందో అర్థం చేసుకున్న తర్వాత నన్ను ప్రశ్నలు అడగండి అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు.

షారుఖ్ ఖాన్‌ సరదా వ్యాఖ్యలకు గూగుల్‌ స్పందించింది. తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో షారుఖ్ ఖాన్‌ ను కింగ్‌ అంటూ చెప్పే విధంగా కిరీటంను షేర్‌ చేయడం జరిగింది. కింగ్‌ అర్థం వచ్చేలా గూగుల్‌ చేసిన ఆ పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ అయ్యింది. సినీ పరిశ్రమలో కింగ్‌ మా షారుఖ్ అని కొందరు, గూగుల్ కు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం మీరు కింగ్‌ అంటూ మరి కొందరు, ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా గూగుల్‌ కి కూడా మీరు కింగ్‌ అంటూ షారుఖ్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో షారుఖ్‌ బ్యాక్‌ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. పదేళ్ల సుదీర్ఘ ఫ్లాప్స్ తర్వాత పఠాన్‌, జవాన్‌ లతో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకున్నాడు. డంకీ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని వసూళ్ల పరంగా అరుదైన రికార్డును నమోదు చేసింది. పదేళ్లు హిట్‌ పడకున్నా మంచి సినిమాతో వస్తే వెయ్యి కోట్లు కేవలం షారుఖ్‌ ఖాన్‌ కి మాత్రమే సాధ్యం అంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో షారుఖ్‌ ఖాన్‌ రెడీ అవుతున్నాడు.

రాబోయే రోజుల్లో షారుఖ్‌ మరిన్ని వెయ్యి కోట్ల సినిమాలతో వస్తాడని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ కి అంతర్జాతీయ స్థాయి పురస్కారం రావడం సంతోషంగా ఉందని ఫ్యాన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌ లో షారుఖ్‌ ఖాన్‌ స్థాయి ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా పెరిగిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

ట్యాంక్ బండ్ పై కిక్కిరిసిన గణపతులు | Ganesh Nimajjanam

Posted : September 18, 2024 at 11:54 am IST by ManaTeluguMovies

ట్యాంక్ బండ్ పై కిక్కిరిసిన గణపతులు | Ganesh Nimajjanam

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad