Advertisement

క‌మ‌ల్ హాస‌న్‌ని కాద‌నుకుని అడివి శేష్‌తో?

Posted : March 5, 2024 at 3:05 pm IST by ManaTeluguMovies

దుల్కర్ సల్మాన్.. వ‌ర్ధ‌మాన న‌టుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్. దక్షిణాదిన పెద్ద‌ స్టార్.. తెలుగు రాష్ట్రాల్లో అత‌డికి అభిమానులు ఉన్నారు. అత‌డు న‌టించిన సినిమాలు పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ‌వుతున్నాయి. దీంతో భాష‌తో సంబంధం లేకుండా అభిమానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతడు తెలుగులో మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. అత‌డు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తో భారీ ప్రాజెక్టును కాద‌నుకుని తెలుగు యువ‌న‌టుడు అడివి శేష్ తో ఒక ప్రాజెక్టుకు క‌మిట‌య్యాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది. అడివి శేష్‌తో మల్టీ స్టారర్ కోసం ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించ‌నుంది. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, బ్యానర్, జానర్ వివరాలను గోప్యంగా ఉంచారు.

దుల్కర్ సల్మాన్ – అడివి శేష్ ఇద్ద‌రూ యువ‌త‌రంలో క్రేజ్ ఉన్న స్టార్స్. ఎంపిక‌ల్లోను యూనిక్ నెస్ తో దూసుకుపోతున్న స్టార్స్. పాన్ ఇండియా ముఖాలుగా ఇద్ద‌రికీ గుర్తింపు ఉంది. దీంతో ఈ ఇద్దరు తారలు కలిసి సినిమా చేయడం అంటే జాతీయ స్థాయిలో గొప్ప ప్రాజెక్ట్ అవుతుంది. అధికారిక ప్రకటన వెలువ‌డాల్సి ఉంది.

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుండి వైదొలిగాడా?

నిజానికి దుల్కర్ సల్మాన్ మణిరత్నం దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న `థ‌గ్ లైఫ్`లో న‌టించాల్సి ఉంది. కానీ ఈ సినిమా నుంచి వైదొలిగాడ‌ని తెలుస్తోంది. ఇందులో కమల్ హాసన్ క‌థానాయ‌కుడు. దుల్కర్ సల్మాన్ ని కీల‌క పాత్ర‌కు ఎంపిక చేయ‌గా, అత‌డు సినిమా నుంచి తప్పుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో దుల్క‌ర్ ఇంత‌కుముందు ఓకే బంగారం చిత్రంలో న‌టించాడు. ఆ సినిమా త‌మిళం, తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది.

కానీ ఈసారి ఈ జోడీ క‌ల‌యిక వీలుప‌డ‌టం లేద‌ని తెలుస్తోంది. థ‌గ్ లైఫ్ చిత్రంలో త్రిష, జయం రవి, నాజర్, అభిరామి త‌దిత‌రులు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. నాయ‌క‌న్ త‌ర్వాత మ‌ణిర‌త్నం- క‌మ‌ల్ క‌ల‌యిక‌లో క్రేజీ ప్రాజెక్ట్ ఇది. దుల్కార్ త‌దుప‌రి సూర్య‌తో ఓ సినిమా.. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో క‌లిసి మ‌రో సినిమా చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Matka Teaser | Varun Tej | Karuna Kumar | Meenakshi Chowdary | Nora Fatehi | GV Prakash Kumar

Posted : October 5, 2024 at 6:09 pm IST by ManaTeluguMovies

Matka Teaser | Varun Tej | Karuna Kumar | Meenakshi Chowdary | Nora Fatehi | GV Prakash Kumar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad