Advertisement

కల్కి నాగ్ అశ్విన్.. ఆ ఇద్దరే అతని అసలు బలం

Posted : July 1, 2024 at 9:04 pm IST by ManaTeluguMovies

నాగ్ అశ్విన్ తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఒక ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరొందారు. శేఖర్ కమ్ముల దగ్గర సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన అతను ఆ తరువాత డైరెక్టర్ గా మారాలని చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. ఫైనల్ గా నాగ్ అశ్విన్ తన తొలి సినిమా “ఎవడే సుబ్రహ్మణ్యం” ద్వారా 2015 లో ఇండస్ట్రీలోకి వచ్చాడు.

వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్ కూతుర్లు స్వప్న, ప్రియాంక దత్ ఇద్దరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినినా నాని ప్రధాన పాత్రలో, అందమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో అశ్విన్ దర్శకత్వంలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రచనలో తన ప్రతిభను చూపించి, ఫిల్మ్ మేకింగ్ లో ఒక కొత్త దారిని సృష్టించాడు. ఆ సినిమా విజయ్ దేవరకొండకు కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

అశ్విన్ తన రెండవ చిత్రం “మహానటి”తో మరింత గుర్తింపు పొందాడు. ఈ సినిమా, దక్షిణ భారత ప్రముఖ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించబడింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక “మహానటి” అశ్విన్ కు జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది. అశ్విన్ చెప్పిన కథనంలో సావిత్రి జీవితంలోని విలువలను, భావోద్వేగాలను ప్రతిభావంతంగా ప్రదర్శించాడు.

ఇక అతని తాజా చిత్రం “కల్కి 2898AD” అశ్విన్ ప్రతిభకు మరో సాక్ష్యం. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులతో చేసిన ఈ చిత్రం, తన కొత్త తరహా కథనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. విజువల్ ఎఫెక్ట్స్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ సినిమా కొత్త యుగం కథలతో తెలుగు సినిమాకు కొత్త పరిమాణాన్ని అందించింది. సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ గా కొనసాగుతోంది.

ఇక ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా నాగ్ అశ్విన్ తనకు సపోర్ట్ గా నిలిచిన నిర్మాతలు అశ్వినీ దత్, స్వప్న దత్ ల గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. స్వప్న దత్ ను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా టైమ్ లోనే ఇష్టపడిన నాగ్ అశ్విన్ పెళ్లి చేసుకున్నారు. ఇక కల్కి సినిమా విజయంతో వారి మరింత ఆనందంలో ఉన్నారు.

ఇక వారి గురించి నాగ్ అశ్విన్ ఈ విధంగా వివరించారు. సుమారు 10 సంవత్సరాల క్రితం, మేము ముగ్గురం కలిసి మా తొలి చిత్రం “ఎవడే సుబ్రహ్మణ్యం”ని ప్రారంభించాము. అప్పుడు వైజయంతి చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఈ చిత్రం రిస్క్‌తో కూడుకున్నది. నాకు ఒక రోజు షూటింగ్ గుర్తుంది. 20 ఎక్స్‌ట్రాలతో ఇబ్బంది పడ్డాం. అనుకున్న టైమ్ కు మేము పూర్తి చేయలేకపోయాము. మేము తిరిగి వచ్చి మళ్లీ సెటప్ చేయాల్సి వచ్చింది. ఆ అదనపు ఖర్చు లెక్కించబడదు.


Advertisement

Recent Random Post:

Chittoor District : మొగిలి దగ్గర మరో రోడ్డు ప్రమాదం | AP News

Posted : September 14, 2024 at 12:07 pm IST by ManaTeluguMovies

Chittoor District : మొగిలి దగ్గర మరో రోడ్డు ప్రమాదం | AP News

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad