Advertisement

కార్ లోనే కాస్టూమ్స్ ఛేంజ్.. హీరోయిన్ డెడికేషన్ అంటే ఇదే..!

Posted : October 5, 2024 at 6:47 pm IST by ManaTeluguMovies

ఒక సినిమా కోసం తెర వెనక ఎంతమంది కష్టపడతారో తెర మీద కనిపించే వారు కూడా అదే రేంజ్ లో కష్టపడుతుంటారు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మీద ఈ బాధ్యత ఎక్కువ ఉంటుంది. స్క్రీన్ మీద అందంగా కనిపించే హీరోయిన్ వెనక కనపడని కష్టం ఉంటుంది. అది ఎవరో చెబుతేనో తెలుస్తుంది. బాలీవుడ్ భామ విద్యా బాలన్ ఒక సినిమా కోసం పడిన కష్టాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా చెప్పి ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేశారు.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతమైన పాత్రలతో మెప్పిస్తూ వస్తున్న నటీమణి విద్యా బాలన్. 2005 లో పరినీతతో మొదలైన ఆమె కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. అంతేకాదు ఛాలెంజింగ్ రోల్స్ అన్నిటిలో కూడా మెప్పించింది. విద్యా బాలన్ అనగానే గుర్తొచ్చేలా కొన్నిల్ సినిమాలు చేసింది. అందులో డర్టీ పిక్చర్, కహాని, భూల్ భూలియా సినిమాలు ఉన్నాయి.

ఐతే కహాని సినిమా కోసం ఆమె పడిన కష్టాన్ని చూపించిన డెడికేషన్ ను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు కాస్టింగ్ ఐరెక్టర్ ముఖేష్ ఛాబ్రా. కహాని షూటింగ్ టైట్ బడ్జెట్ వల్ల వానిటీ వ్యాన్ అదే కార్ వ్యాన్ ని ఏర్పాటు చేయలేకపోయారట. ఐతే ఒక సీన్ లో విద్యా బాలన్ కాస్టూమ్స్ ఛేంజ్ చేయాల్సిన అవసరం రాగా అక్కడ పక్కనే ఉన్న కార్ లో కాస్టూమ్స్ మార్చుకున్నదని చెప్పుకొచ్చారు.

రోడ్డు పక్కనే ఇన్నోవా కార్ కు బ్లాక్ క్లాత్ కట్టి ఆమెను అందులోనే కాస్టూమ్స్ మార్చుకోమని అన్నారు. విద్యా బాలన్ కూడా ఎలాంటి ఇబ్బంది ఫీల్ అవ్వకుండా కాస్టూమ్స్ మార్చుకుని వచ్చేసింది. సినిమా పట్ల ఆమెకు ఉన్న అంకిత భావానికి హ్యాట్సాఫ్ అనేశారు. విద్యా బాలన్ ని అభినానించే వారు ఈ విషయం తెలిసి ఆమెను మరింత ఎక్కువగా ఇష్టపడతారు. కహాని సినిమా కోసం విద్యా బాలన్ అంత కష్టపడ్డారు కాబట్టే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈమధ్య కాస్త జోరు తగ్గించిన విద్యా బాలన్ ఎలాంటి పాత్ర వచ్చినా ఇప్పటికీ చేసేందుకు రెడీ అని అంటుంది. ప్రస్తుతం హిందీలో అమ్మడు రెండు ప్రాజెక్టుల్లో నటిస్తుంది.


Advertisement

Recent Random Post:

చెన్నైను భయపెడుతున్న వర్షాలు l Heavy Rain In Chennai l Tamil Nadu

Posted : October 15, 2024 at 8:43 pm IST by ManaTeluguMovies

చెన్నైను భయపెడుతున్న వర్షాలు l Heavy Rain In Chennai l Tamil Nadu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad