Advertisement

జైలు జీవితాన్ని అమ్మేస్తున్న సిస‌లైన న‌టుడు!

Posted : November 2, 2023 at 8:21 pm IST by ManaTeluguMovies

ప్ర‌త్య‌ర్థి క్యాచ్ డ్రాప్ చేశాకే, మ‌న‌కు బాల్ ని ఎలా బాదాలో తెలుస్తుంది! ఇప్పుడు రాజ్ కుంద్రా కూడా బ్యాట్ ని అలానే ఝ‌లిపిస్తున్నాడు. అతడు ఒక ర‌కంగా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడేస్తున్నాడు. జైలుకు వెళ్లిన‌వాడు, ఇప్పుడు ఏకంగా తన జైలు జీవితాన్ని సినిమాగా చూపించి ఎన్ క్యాష్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఒక పెద్ద దెబ్బ తిన్న త‌ర్వాత దానిని కూడా వ్యాపార వ‌స్తువుగా మార్చేసాడు. వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన న‌ట‌విశ్వ‌రూపం చూపించ‌బోతున్నాడు. బిజినెస్ కి కాదేదీ అన‌ర్హం అని నిరూపిస్తున్నాడు.

పోర్న్ వీడియోల యాప్ ల బిజినెస్ చేస్తున్నాడంటూ అత‌డిని అరెస్ట్ చేసిన పోలీసులు కూడా ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తున్నాడు. అత‌డు బెయిల్ పై జైలు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మాస్క్ మ్యాన్ అవ‌తారంతో ప‌బ్లిగ్గా తిరిగాడు. ఇప్పుడు న‌టుడిగా రంగ ప్ర‌వేశం చేస్తూ UT 69 అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా కారణంగా ఇటీవల హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. వాస్త‌వానికి అశ్లీలత కేసులో 2021లో కుంద్రాను జైలులో ఉంచారు.

అక్క‌డ ఎన్ని క‌ష్టాలు పడ్డాడో ఇదిగో ఈ ఫోటోలో క‌నిపిస్తోంది. ఒకే బాత్రూమ్ లావెట్రీ కోసం వంద‌మంది క్యూలో నించుంటే ఆ క‌ష్టం ఎలా ఉంటుందో కుంద్రాజీ జైల్లో అనుభవించి త‌రించారు. UT 69 చిత్రంలో జైలులో అతని నిజ జీవిత అనుభవాలను ఆవిష్క‌రించార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌న సినిమాకి విచిత్రంగా ప్ర‌మోష‌న్ చేస్తున్నాడు. రాజ్ కుంద్రా ఇటీవల `ఫుడ్ పోర్న్`లో మునిగి, స్ట్రీట్ ఫుడ్ ని విక్రయిస్తూ క‌నిపించిన వీడియో వైర‌ల్ అయింది. `ఫుడ్ పోర్న్` అని రాసిన నలుపు రంగు టీ-షర్టును ధరించి ప‌రిహాసం చేసాడు కుంద్రాజీ. తాను క‌ష్ట‌కాలంలో స్ట్రీట్ ఫుడ్ విక్ర‌యించిన రోజుల్ని కూడా గుర్తు చేసుకున్నాడు. అతడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేసి తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు, “#foodporn నేను ఇప్పటివరకు భాగమైన ఏకైక ‘పోర్న్’! #chandnichowk #ut69 #film #food. అని రాసాడు.

కుంద్రా చట్టపరమైన ప్రక్రియలకు సమయం పట్టడంతో తాను జైలులో చిక్కుకుపోయానని గుర్తుచేసుకున్నాడు. రాజ్ కుంద్రా జైలులో ఉన్నందుకు తన కుమారుడు వియాన్ స్పందనను ఒక‌ ఇంటర్వ్యూలో వెల్ల‌డించాడు. రాజ్ కుంద్రా తన కొడుకు వియాన్ తాను జైలులో ఉన్నట్లు ఎలా గ్రహించాడో అది తనను ఎలా కలవరపెట్టిందో గుర్తుచేసుకున్నాడు. తాను లేనప్పుడు, “వియాన్ ఎలా వీక్ అయిపోతున్నాడో రాజ్ కుంద్రా వెల్లడించాడు. రాజ్ ఎక్కడ ఉన్నాడో చిన్నారికి వివరించడం త‌న‌ భార్య, శిల్పాశెట్టికి కష్టంగా మారిందని కూడా తెలిపాడు. నాన్న కూచీ కాబ‌ట్టి త‌న కుమారుడు ఎంతో వేచి చూసాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసాడు. వీట‌న్నిటినీ అత‌డు పెద్ద తెర‌పై చూపించేస్తున్నాడనేది టాక్. మొత్తానికి త‌న‌కు ఎదురైన అవ‌మానాన్ని కూడా అత‌డు ఎలా ఎన్ క్యాష్ చేయాల‌నుకుంటున్నాడో, ఏ ర‌కంగా బిజినెస్ చేయాలో చూపించ‌డం.. ఔత్సాహిక యువ ఎంట‌ర్ ప్రెన్యూర్ల‌కు ఒక పాఠం లాంటిది.


Advertisement

Recent Random Post:

కిమ్ చేతిలో అణుబాంబు.. పిచ్చోడి చేతిలో రాయేనా? | Story Behind North Korea Nuclear Weapons | KIM

Posted : September 16, 2024 at 9:48 pm IST by ManaTeluguMovies

కిమ్ చేతిలో అణుబాంబు.. పిచ్చోడి చేతిలో రాయేనా? | Story Behind North Korea Nuclear Weapons | KIM

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad