Advertisement

తారకరత్న ఫ్యామిలీలో బాలయ్య.. మళ్ళీ వారసుడొచ్చాడు

Posted : April 20, 2024 at 7:10 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్శకుడు కొల్లి బాబీ డైరెక్షన్ లో ఆయన చేస్తున్న మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా బాలయ్య ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్నారు. హిందూపురం నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరపున ఆయన బరిలోకి దిగారు. బాలకృష్ణ భార్య వసుంధర కూడా ప్రచారం చేస్తున్నారు.

ఇక కొన్ని నెలల క్రితం నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. తారకరత్న మరణం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు ఆయన భార్య అలేఖ్య. తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటారు. తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతుంటారు. నందమూరి బాలకృష్ణతో దిగిన ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు.

ఇప్పటికే తనకు మావయ్య వరుస అయ్యే బాలకృష్ణపై అనేకసార్లు అభిమానాన్ని చూపించిన అలేఖ్య.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. “నన్ను ఎప్పుడూ అందరూ ఎటు వైపు ఉంటానని అడుగుతున్నారు. తాను ఎప్పుడూ ప్రేమ, మానవత్వం, ముఖ్యంగా కుటుంబం వైపే ఉంటాను. మావయ్య (బాలకృష్ణ) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాం” అంటూ రాసుకొచ్చారు.

ఆ ఫోటోలో బాలయ్య, మోక్షజ్ఞ తో పాటు అలేఖ్య, ముగ్గురు పిల్లలు కనిపిస్తున్నారు. ఈ పిక్ చూసి నందమూరి అభిమానులు.. ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. తారకరత్న పిల్లలను బాలయ్య బాబు చక్కగా చూసుకుంటున్నారని కామెంట్లు పెడుతున్నారు. బాధ్యత అంటే అలా ఉండాలని చెబుతున్నారు. ఇక మోక్షజ్ఞ కిరాక్ లుక్ అదిరిందని అంటున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం వెయిటింగ్ అంటూ సందడి చేస్తున్నారు.

మోక్షజ్ఞ బ్లాక్ కలర్ షర్ట్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. సినీ ఎంట్రీకి సిద్ధమైనట్లుగా ఉన్నారు. మోక్షజ్ఞను డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య లాంఛ్ చేయిస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బోయపాటి శ్రీను సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. వీరద్దరి మధ్య స్క్రిప్ట్ గురించి డిస్క‌ష‌న్స్ కూడా జరిగాయని వినికిడి. మరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

Megastar Chiranjeevi Meets CM Chandrababu & Donates 1 Crore For Flood Relief

Posted : October 12, 2024 at 9:18 pm IST by ManaTeluguMovies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad