టాలీవుడ్ లో మొదటి సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన హనుమాన్ సినిమాతో తేజ సజ్జా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ విజయాలు సాధించిన సినిమాల జాబితాలో చేరి పోయింది.
హనుమాన్ కి సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఆ గ్యాప్ లో తేజ సజ్జా ఓ భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను చేసేందుకు సిద్ధం అయ్యాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా లో తేజ సజ్జా హీరోగా నటించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
అదే సినిమాలో మరో హీరోగా మంచు మనోజ్ నటించబోతున్నాడు. ఇద్దరు హీరోలు కలిసి నటించబోతున్న భారీ మల్టీ స్టారర్ మూవీ లో హాయ్ నాన్న మూవీ లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రితికా నాయక్ ను ఒక హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది.
తేజ కు జోడీగా రితికా నటించబోతుందని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. హాయ్ నాన్నకు ముందు అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా లో కూడా హీరోయిన్ గా నటించిన రితికా నటించి మెప్పించింది.
రితికా తెలుగు లో ముందు ముందు భారీ సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. అందంతో పాటు నటనతో అలరించే సత్తా ఈ అమ్మడి సొంతం. అందుకే తేజతో నటించబోతున్న ఈ సినిమా హిట్ అయితే ముందు ముందు స్టార్ హీరోలకు జోడీ కట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మన సూపర్ హీరో తేజ కి కొత్త జోడీ దొరికింది.