Advertisement

నవ్వుల పాలవ్వకుండా కాపాడుకున్న భూమి!

Posted : November 11, 2022 at 9:03 pm IST by ManaTeluguMovies

ముంబైలో ప్రతిష్ఠాత్మక GQ అవార్డ్స్- 2022 ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. గ్రీన్ కార్పెట్ పై అందాల రాశుల ఫ్యాషన్ సవ్వడి నిత్యనూతనంగా అలరించింది. అయితే ఈ వేదిక ఆద్యంతం బాలీవుడ్ నాయిక భూమి పెడ్నేకర్ షో స్టాపర్ గా నిలవడమే కాదు.. అనూహ్యంగా ఫ్యాషన్ సెన్స్ పరంగా తనకు ఎదురైన ఓ సమస్యను పరిష్కరించుకోగలిగింది. భూమి అసౌకర్యంలోను ఎంతో తెలివిగా వార్డ్ రోబ్ లోపాన్ని సవరించగలిగింది. నెటిజనులు ఇలాంటి అసౌకర్యమైన దుస్తులను ఎందుకు ధరిస్తావ్? అంటూ తనని సూటిగా ప్రశ్నించినా దానిని ఎంతో తెలివిగా మ్యానేజ్ చేయగలిగింది.

నిజానికి టాప్ హీరోయిన్స్ క్యాట్ వాక్ ల నడుమ అవార్డ్స్ వేదికపై భూమి పెడ్నేకర్ ఫ్యాషన్ ఎలివేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే తాను ఎంచుకున్న దుస్తుల్లో ఏదో తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ దుస్తుల్లో భూమి ఏమంత సౌకర్యంగా లేదు. చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది. తనకు సహచరుల సహాయం అవసరమవుతోంది. తాను గ్రీన్ కార్పెట్ పై నడిచి వెళుతుంటే తన వెంటే ఉండి ఒకరు నేలపై పొర్లుతున్న దుపట్టాను మోయాల్సి వచ్చింది. ఈ ప్రహసనం అంతా చూశాక .. నెటిజనులు ఎందుకలా అసౌకర్యమైన దుస్తులు ధరిస్తున్నావ్? అంటూ ప్రశ్నించారు. అయితే ఫ్యాషన్ ప్రపంచంలో ఇలాంటి సందర్భాలను పలుమార్లు ఫేస్ చేసిన భూమి ఇప్పుడు తెలివిగా దానిని మ్యానేజ్ చేసేసింది.

కెరీర్ పరంగా చాలా తక్కువ వ్యవధిలో తనదైన నటనతో సత్తా చాటి బాలీవుడ్ పాపులర్ స్టార్ గా భూమి తన బ్రాండ్ ను విస్తరించింది. `దమ్ లగా కే హైషా`తో చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ తన బహుముఖ ప్రజ్ఞతో మైమరిపించింది. కేవలం నటిగానే కాదు.. స్టైల్ కంటెంట్.. ఫ్యాషన్ ఎలివేషన్ పరంగానూ చాలా అప్ గ్రేడెడ్ గా ఉంటూ నిరంతరం షో స్టాపర్ గా నిలుస్తోంది. భూమి ఎంపికలు ఫ్యాషన్ ఔత్సాహికుల మధ్య చర్చనీయాంశంగా మారుతున్నాయి.

గత రాత్రి GQ అవార్డ్స్ లో భూమి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చింది. నిజానికి భూమికి ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్ ఉంది. అవి దేశీ దుస్తులు అయినా లేదా పాశ్చాత్య దుస్తులు అయినా చూపరులను ఆకట్టుకోవడం ఎలానో తనకు బాగా తెలుసు. కానీ గత రాత్రి రిస్క్ చేసింది. తనకు సూట్ కాని దుస్తులలో చాలా అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించింది ఈ లోపాన్ని నెటిజన్లు కూడా ఎత్తి చూపారు. అయితే అనూహ్యంగా పెద్ద వార్డ్ రోబ్ లోపం నుండి తనను తాను రక్షించుకుంది. ముంబై ఫోటోగ్రాఫర్లు అధికారిక ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో భూమి పెడ్నేకర్ గ్రీన్ కార్పెట్ పై నడుస్తూ.. బ్లాక్ దుస్తుల్లో కెమెరాలకు పోజులిచ్చింది. హాల్టర్ నెక్ టాప్ .. పొడవాటి కాలిబాటతో థై స్లిట్ స్కర్ట్ సహా బ్లాక్ కో-ఆర్డ్ సెట్ ని ధరించింది. బ్లాక్ హైహీల్స్.. బంగారు గాజులు.. హోప్ చెవిపోగులు.. గ్లామ్ మేకప్ తో కనిపించింది.

వీడియో పరిశీలనగా చూస్తే.. భూమి తన దుస్తుల్లో అనూహ్యంగా ఇబ్బందిపడుతోంది. స్లిట్ స్కర్ట్ ని మ్యానేజ్ చేయడం నిజానికి చాలా ప్రమాదకరం. అయితే భూమి అప్పటి పరిస్థితులను అదుపు తప్పకుండా తెలివిగా మేనేజ్ చేయగలిగింది. లేకపోతే వార్డ్ రోబ్ సమస్యతో నవ్వుల పాలయ్యే అవకాశమే ఎక్కువ. వీడియో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు స్పందించడం ప్రారంభించారు. భూమి పెడ్నేకర్ అటువంటి అసౌకర్య దుస్తులను ధరించినందుకు ట్రోలింగ్ ప్రారంభించారు.

“భూమికి సెక్సీ పాశ్చాత్య దుస్తులను ధరించడానికి సరిపడే బాడీ లాంగ్వేజ్ లేదు….తనను ద్వేషించకండి.. నిజానికి ఆమె నిండు బట్టలతోనే మెరుగ్గా కనిపిస్తుంది“ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.

ఈజ్ సే జ్యాదా వహియాత్ డ్రెస్ నహీ మిలీ పెహెన్ నే కో ?? అని ఒకరు..“ఇత్నీ అసౌకర్య దుస్తులు ఫంటి హాయ్ క్యు హో ..ఔర్ ఐసా ఎల్జి రహా సాన్స్ అందర్ ఖించ్ రాఖీ హెచ్ పెట్ స్లిమ్ దిఖానే కే లియే “ అని మరొకరు వ్యాఖ్యానించారు. మరో నెటిజన్ “జన్నత్ దిఖ్ జాయేగా దీదీ.. జన్నత్ దిఖాదుంగీ వాలా సీరియస్ లేలియా సయద్ “ అని ఛమత్కరించాడు.


Advertisement

Recent Random Post:

Bhumana Karunakar Reddy: తప్పు చేస్తే నేను, నా కుటుంబం సర్వనాశనం అవుతుంది

Posted : September 23, 2024 at 5:38 pm IST by ManaTeluguMovies

Bhumana Karunakar Reddy: తప్పు చేస్తే నేను, నా కుటుంబం సర్వనాశనం అవుతుంది

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad