Advertisement

నాటి త‌రం హీరోల త‌ర్వాత ఆ ఛాన్స్ ప్ర‌భాస్ దే!

Posted : April 17, 2024 at 8:32 pm IST by ManaTeluguMovies

ఈ త‌రం హీరోల్లో వెండి తెర రాముడు ఎవ‌రంటే? ఠక్కున గుర్తొచ్చే పేరు ప్ర‌భాస్. `ఆదిపురుష్` సినిమాలో రాముడి పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని చేసిన ప్ర‌య‌త్న‌మ‌ది. రాముడి పాత్ర‌కు అన్ని ర‌కాలుగా ప్ర‌భాస్ స‌రితూగినా మేకింగ్ వైఫల్యంతో అనుకున్న ఫ‌లితాలు సాధించ‌లేదు. అయితే రాముడి పాత్ర పోషించినందుకు ప్ర‌భాస్ మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్టీఆర్..ఏఎన్నార్..శోభ‌న్ బాబు…హ‌రినాధ్..బాల‌కృష్ణ‌ లాంటి సీనియ‌ర్ న‌టుల త‌ర్వాత అంత‌టి సాహసం కేవ‌లం ప్ర‌భాస్ మాత్ర‌మే చేసాడు.

ప్ర‌భాస్ క‌న్నా ముందు న‌టులు.. సీనియ‌ర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్లెవ్వ‌రు చేయ‌ని సాహ‌సం డార్లింగ్ చేయ‌డం గొప్ప విష‌య‌మే. అయితే ఆ పాత్ర పోషించే అవ‌కాశం త‌న‌కు రావ‌డంతోనే అది సాద్య‌మైంది. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది న‌టులు ఉన్నా! ఆ ఛాన్స్ తీసుకుంది కూడా ప్ర‌భాస్ కావ‌డం విశేషం. మ‌ళ్లీ ఇప్ప‌ట్లో టాలీవుడ్ లో రాముడి పాత్ర అన్న‌ది అంత ఈజీ కాదు. ప్ర‌స్తుతం రామాయ‌ణంని బాలీవుడ్ లో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రాముడి పాత్ర‌లో ర‌ణ‌బీర్ క‌పూర్ న‌టిస్తున్నాడు.

ఇప్ప‌టికే రాముడి ఆహార్యంలో ర‌ణ‌బీర్ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్లు నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. వాటిలో ర‌ణ‌బీర్ లుక్ రాముడి ఇలాగే ఉంటాడా? అనిపించే అంత వైభ‌వంగా క‌నిపిస్తున్నాడు. ప్ర‌భాస్ కంటే ర‌ణ‌బీర్ లుక్ మ‌రింత బెట‌ర్ గా క‌నిపిస్తుంది. రాముడి పాత్ర విష‌యంలో వాళ్లిద్ద‌ర్నీ ప‌క్క‌న‌బెట్టి చూస్తే ఆహార్యం విష‌యంలో ప్ర‌భాస్ మేకోవ‌ర్ కాస్త డానిమేష‌న్ గా అనిపిస్తుంది. ర‌ణ‌బీర్ క‌పూర్ మాత్రం ప‌క్కాగా సూటయిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇక ఈ పాత్ర కోసం క‌మిట్ అయిన వెంట‌నే ర‌ణ‌బీర్ షూటింగ్ పూర్తయ్యేవ‌ర‌కూ మ‌ద్యం….మాసాంహారం తీసుకోన‌ని ఒట్టు కూడా పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. నితీష్ తివారీ ఈ చిత్రాన్ని భారీ కాన్వాస్ పై తెర‌కెక్కిస్తున్నాడు.

ఇంకా ఈసినిమాలో సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి…రావ‌ణుడి పాత్ర‌లో య‌శ్..హ‌నుమంతుడి పాత్ర‌లో దేవ‌ద‌త్ .. కుంభ‌క‌ర్ణుడి పాత్ర‌లో బాబి డియోల్ పోషిస్తున్నారు. వీళ్ల ఎంపిక‌తోనే రామాయ‌ణం స‌గం స‌క్సెస్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. అంతా గ్రేట్ పెర్పార్మెర్లు కావ‌డంతోనే ఈ బ‌జ్ కి నాంది పండింది. ఇంకా రామాయ‌ణంలో ఉన్న పాత్ర‌ల‌కు చాలా మంది ప్ర‌ముఖ‌ల పేర్లు వెలుగులోకి వ‌స్తున్నాయి.


Advertisement

Recent Random Post:

9 PM || ETV Telugu News | 23rd July 2024

Posted : July 23, 2024 at 10:23 pm IST by ManaTeluguMovies

9 PM || ETV Telugu News | 23rd July 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement