Advertisement

పవన్ వయస్సు ఎంత?

Posted : March 28, 2020 at 12:50 pm IST by ManaTeluguMovies

వికీపీడియా ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1969లో పుట్టారు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 దాటిందన్నమాట. ఈ ఏడాది సెప్టెంబర్ కు 53వ పడిలోకి వస్తారు. అయితే ఇది నిజమేనా? పవన్ వయస్సు ఇంకా ఎక్కువా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ ఓ ఫొటో ట్విట్టర్ లో షేర్ చేసారు. ఆ ఫొటోలో రామ్ చరణ్ ను పవన్ ఆశీర్వదిస్తున్నట్లు వుంది.

విషయం ఏమిటంటే, రామ్ చరణ్ వయస్సు ఇప్పుడు దాదాపు 35 ఏళ్లు. ఆ ఫోటోలో పవన్ ను చూస్తుంటే 20 ఏళ్లకు మించి వున్నట్లు కనిపిస్తున్నారు. పోనీ 20 ఏళ్లే అనుకున్నా చూసుకుంటే పవన్ వయస్సు 55 ఏళ్లు అనుకోవాలి.

పవన్ వయస్సు ఎంతయితే ఏమిటి? ఇప్పుడు అవసరమా? అనే వారుండొచ్చు.. కానీ పవన్ ఫ్యాన్స్ జగన్ కన్నా పవన్ చిన్న అని అంటుంటారు. కానీ వికీ పీడియా ప్రకారం చూసినా జగన్ 1972లో పుట్టారు. పవన్ 1969లో పుట్టారు. కానీ ఈ రోజు చిరు షేర్ చేసిన పిక్ చూస్తే మాత్రం కనీసం పవన్ వయస్సు విషయంలో కాస్త ఎక్కువ తేడా వుందని అనిపిస్తుంది.


Advertisement

Recent Random Post:

Chandrababu Oath Ceremony :ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి,రజినీకాంత్

Posted : June 12, 2024 at 1:12 pm IST by ManaTeluguMovies

Chandrababu Oath Ceremony :ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి,రజినీకాంత్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement