Advertisement

పెళ్లికి పిల‌వ‌లేద‌ని ఇలా త‌గులుకున్నావేంటి అమ్మ‌డు!

Posted : November 7, 2024 at 2:50 pm IST by ManaTeluguMovies

కోలీవుడ్ న‌టి, శ‌ర‌త్ కుమార్ కుమార్తె వ‌ర‌ల‌క్ష్మి వివాహం ఇటీవ‌ల ఎంత గ్రాండ్ గా అయిందో తెలిసిందే. అప్ప‌టికే అమ్మ‌డు టాలీవుడ్ లో ముమ్మ‌రంగా సినిమాలు చేస్తోంది. దీంతో టాలీవుడ్ సినీ ప్ర‌ముఖుల్ని ప్ర‌త్యేకంగా పెళ్లికి ఆహ్వానించింది. అతిధులంద‌రికీ తానే స్వ‌యంగా పెళ్లి శుభ‌లేక‌లు ఇంటింటికి వెళ్లి మ‌రీ అందించింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరోల వ‌ర‌కూ త‌న ప‌రిచ‌య‌స్తులంద‌ర్నీ ఆహ్వానించింది.

ఇందులో ద‌గ్గుబాటి ఫ్యామిలీ స‌భ్యులు కూడా ఉన్నారు. వ‌ర‌ల‌క్ష్మి, శ‌ర‌త్ కుమార్ స్వ‌యంగా వెళ్లి కార్డులు అందించారు. దీంతో పెళ్లికి వెళ్లాల‌నుకున్న వారు పెళ్లికి వెళ్లారు. ఆ త‌ర్వాత చెన్నైలో జ‌రిగిన రిసెప్ష‌న్ కి మాత్రం చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు హాజ‌రయ్యారు. శ‌త‌ర్ కుమార్ కి కూడా టాలీవుడ్ లో న‌టుల‌తో మంచి అనుబంధం ఉండ‌టంతో చాలా మంది చెన్నై వెళ్లి న‌వ‌దంప‌తుల్ని ఆశీర్వ దించారు.

అయితే ఐఫా వేదిక‌లో రానా ద‌గ్గుబాటి మా ఇంట్లో అంద‌ర్నీ పెళ్లికి పిలిచావ్? న‌న్ను పిల‌వ‌లేదు అన్నాడు. దీంతో వ‌ర‌ల‌క్ష్మి నీ (రానా) పెళ్లికి న‌న్ను పిల‌వ‌లేదు కాబ‌ట్టి నేను పిల‌వ‌లేదు అని బ‌ధులిచ్చింది. దీనికి రానా స్పందిస్తూ `నేను క‌రోనా పాండ‌మిక్ స‌మ‌యంలో పెళ్లిచేసుకున్నాను. అందుకే పిల‌వ‌లేక‌పోయాను` అన్నారు. ఆ వెంట‌నే బ్యాక్ గ్రౌండ్ లో పోసాని సినిమా డైలాగ్ ని వ‌స్తుంది. `ఇదేరా ఇండియ‌న్స్ సైకాల‌జీ` అంటూ పోసాని మాట్లాడుతాడు.

రానా..వ‌ర‌ల‌క్ష్మి స‌న్నివేశాకి ఆ డైలాగ్ ని జోడించి నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడా స‌న్నివేశానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుంది. ఆ వీడియో నెటి జ‌నులతో న‌వ్వులు పువ్వులు పూయిస్తుంది. వాళ్లిద్ద‌రి సంభాషణ మ‌ధ్య పోసాని సినిమా డైలాగ్ ప‌ర్పెక్ట్ గా సింక్ అయిందంటున్నారు.


Advertisement

Recent Random Post:

Sarangapani Jathakam Teaser | Priyadarshi | Roopa Koduvayur | MohanaKrishna Indraganti

Posted : November 21, 2024 at 2:56 pm IST by ManaTeluguMovies

Sarangapani Jathakam Teaser | Priyadarshi | Roopa Koduvayur | MohanaKrishna Indraganti

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad