Advertisement

ప్రభాస్ పాట విని అనుష్క ఎమోషనల్‌..!

Posted : February 8, 2024 at 2:45 pm IST by ManaTeluguMovies

ప్రభాస్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’ సినిమా భారీ విజయాన్నిసొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలోని పాటలు కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఇప్పటికి కూడా మిర్చి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి అంటే ఏ స్థాయి విజయాన్ని ఆ పాటలు దక్కించుకున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా మిర్చి సినిమాలోని పండగలా దిగివచ్చావు… పాటకు మంచి స్పందన వచ్చింది. ఆ పాటలోని రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక అభిమాని మళ్లీ ఎప్పుడు ఇలాంటి పాటలు రాస్తారు అంటూ రామ జోగయ్య శాస్త్రిని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు రామ జోగయ్య శాస్త్రి స్పందిస్తూ… ఆ సినిమా ప్రయాణం ఒక అందమైన జ్ఞాపకం. పాట రాసి వినిపించిన సమయంలో హీరోయిన్ అనుష్క ఎమోషనల్‌ అయ్యారు. ఆమెకు లిరిక్స్ బాగా నచ్చాయి.అనుష్క గారు కనెక్ట్‌ అయ్యి ఎమోషనల్ అయ్యారంటూ శాస్త్రి పేర్కొన్నారు.

ప్రభాస్‌, అనుష్క కలిసి నటించిన మిర్చి సినిమా తర్వాత ఇద్దరు వివాహం చేసుకుంటారు… ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మిర్చి సినిమా ప్రభాస్‌ మరియు అనుష్కలతో పాటు వారి అభిమానులకు చాలా ప్రత్యేకమైన సినిమా అనడంలో సందేహం లేదు


Advertisement

Recent Random Post:

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం | Israel Hezbollah War | Hezbollah Rapid Attack On Israel

Posted : October 7, 2024 at 5:45 pm IST by ManaTeluguMovies

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం | Israel Hezbollah War | Hezbollah Rapid Attack On Israel

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad