Advertisement

బాలీవుడ్ క్వీన్ కి షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు!

Posted : February 3, 2024 at 10:37 pm IST by ManaTeluguMovies

బాలీవుడ న‌టి కంగ‌నా ర‌నౌత్ కి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. గేయ రచయిత జావెద్ అక్తర్‌ తనపై వేసిన పరువు నష్టం కేసులో స్టే ఇవ్వాలన్న ఆమె పిటిషన్ విచార‌ణ‌ని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. క్రాస్ కేసుల‌ను కూడా వీటితో క‌ల‌పాలంటూ కంగ‌న అభ్య‌ర్ధ‌న‌ను కోర్టు తిర‌స్క‌రించింది. కంగ‌న వాటిని క్రాస్ కేసు ల‌ని చెప్ప‌క‌పోవ‌డం వ‌ల‌న ప్రోసీడింగ్ ల‌ను నిలిపివేయ‌డం..లేదంటే క్ల‌బ్ చేయ‌డం సాధ్యం కాద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

జావెద్ అక్తర్ ఫిర్యాదు తొలుత దాఖలు చేశారని.. కాబట్టి ఈ దశలో ఊరట కల్పించలేమని పేర్కొన్నారు. ఆ రెండు కేసులు క్రాస్ కేసులేన‌ని పిటీష‌న‌ర్ కంగ‌న ఎప్పుడూ పేర్కొన‌లేద‌ని తెలిపారు. దీంతో కంగ‌న ఇర‌కా టంలో ప‌డిన‌ట్లు అయింది. బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్ తో ఆఫైర్ విష‌యంలో వివాదం త‌ర్వాత జావెద్ అక్త‌ర్ త‌న‌ని..త‌న సోద‌రి రంగోలిని ఇంటికి పిలిపించి దుర్బాష‌లాడి..బెదిరించినట్లు ఓ ఇంట ర్వ్యూలో కంగ‌న ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

దీంతో జావెద్ అక్త‌ర్ ప‌రువుకు భంగం క‌లిగింద‌ని మూడేళ్ల క్రితం కోర్టులో కేసు వేసారు. అటుపై జాదేవ్ పిర్యాదుపై కంగ‌న కౌంట‌ర్ ఫైల్ చేసింది. కంగనపై జావెద్ దాఖలు చేసిన పరువునష్టం కేసు అంధేరీలోని మేజిస్ట్రేట్ ముందు కొనసాగుతుండగా ఆయనపై కంగన దాఖలు చేసిన ఫిర్యాదుపై సెషన్స్ కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఇదే కేసు పై కోర్టుకు వెళ్ల‌డంతో బాంబే హైకోర్టు లో కంగ‌న‌కు చుక్కెదురైంది. కంగ‌నకి ఇలాంటి వివాదాలు కొత్తేం కాదు.

అమ్మ‌డి పేరు కోర్టు వ‌ర‌కూ వెళ్ల‌ని ఎన్నో వివాదాల్లో తెర‌పైకి వ‌చ్చింది. తాను ఏది చెప్పాల‌నుకున్నా..విమ‌ర్శించాల‌నుకున్నా మీడియా స‌మ‌క్షంలోనే నిప్పులు చెరుగుతుంది. ప్ర‌త్య‌ర్ధి ఎంత‌టి బల‌వంతుడైనా కంగ‌న స్టైల్లో చెల‌రేగుతుంది. ఇప్ప‌టికే బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌పై ఎన్నో ఆరోప‌ణ‌లు చేసింది. కానీ త‌న కెరీర్ ప‌రంగా ప‌రిశ్ర‌మ నుంచి ఎలాంటి అవ‌రోధాలు ఎదురవ్వ‌లేదు. అవ‌స‌రం మేర తానే ద‌ర్శ‌కురాలిగా..నిర్మాత‌గా మారిపోతుంటుంది.


Advertisement

Recent Random Post:

ఇకపై అలా మాట్లాడను..మంత్రి లోకేష్‌కి శ్రీరెడ్డి క్షమాపణ లేఖ | Sri Reddy letter To Nara Lokesh –

Posted : November 14, 2024 at 1:55 pm IST by ManaTeluguMovies

ఇకపై అలా మాట్లాడను..మంత్రి లోకేష్‌కి శ్రీరెడ్డి క్షమాపణ లేఖ | Sri Reddy letter To Nara Lokesh –

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad