Advertisement

మరో క్రేజీ ప్రాజెక్ట్‌ లో సీనియర్ హీరోయిన్‌

Posted : November 20, 2023 at 6:30 pm IST by ManaTeluguMovies

హీరోయిన్‌ గా తెరంగేట్రం చేసి రెండు దశాబ్దాలు దాటినా కూడా హాట్ బ్యూటీ త్రిష ఆఫర్ల విషయంలో యంగ్‌ స్టార్‌ హీరోయిన్స్ తో పోటీ పడుతోంది అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయడంతో పాటు, కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ ల్లో కూడా నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన పొన్నియన్‌ సెల్వన్‌ లో నటించడం ద్వారా మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో త్రిష పేరు మారుమ్రోగింది అనడంలో సందేహం లేదు. ఆ సినిమా తో మరింత జోష్ తో, దూకుడుతో త్రిష దూసుకు పోతుంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ లో త్రిష కు ఛాన్స్ లభించింది అని తమిళ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ మరియు లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం కాంబోలో మూవీ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి త్వరలో సినిమా షూటింగ్ ను ప్రారంభించి వచ్చే ఏడాది లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్స్ కనిపించబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది.

ఆ ఇద్దరు హీరోయిన్స్ లో త్రిష కూడా ఒకరు అంటూ తమిళ మీడియా కోడై కూస్తోంది. పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే కమల్‌ మరియు మణిరత్నం క్రేజీ ప్రాజెక్ట్‌ ను త్రిష దాదాపుగా దక్కించుకున్నట్లే అనిపిస్తోంది. కచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ ఆమెకి మరింతగా బూస్ట్‌ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా గురించి, త్రిష హీరోయిన్ గా నటించబోతోంది అనే విషయం గురించి క్లారిటీ రావాల్సి ఉంది


Advertisement

Recent Random Post:

బాపట్లలో తీరం తాకిన తుపాన్.. | Cyclone Migjaum Updates –

Posted : December 5, 2023 at 11:36 am IST by ManaTeluguMovies

బాపట్లలో తీరం తాకిన తుపాన్.. | Cyclone Migjaum Updates –

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement