Advertisement

మెగా రేసులో బన్నీ టాప్ గేర్!

Posted : April 13, 2024 at 8:49 pm IST by ManaTeluguMovies

మెగాస్టార్ స్టార్ చిరంజీవి ఇమేజ్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీని రూల్ చేస్తోన్న నటులు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కనిపిస్తారు. వీరి తర్వాత సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఉన్నారు. మిగిలిన నలుగురు టైర్ 2 హీరోలుగానే ఫైట్ చేస్తున్నారు. మెగాస్టార్ తర్వాత స్టార్ హీరోలుగా ప్రస్తుతం మార్కెట్ లో పవన్, చరణ్, బన్నీ వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నారు.

అయితే వీరందరిలో మార్కెట్ పరంగా ఎవరిది ఆధిపత్యం అంటే ప్రస్తుతం వినిపించే మాట అల్లు అర్జున్ అని. పుష్ప సినిమాతో టాలీవుడ్ లో ఎవరికి సాధ్యం కానీ నేషనల్ అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. చిరంజీవి వందల చిత్రాలు చేసిన ఇప్పటి వరకు నేషనల్ అవార్డు అందుకోలేకపోయారు. పుష్ప మూవీ బన్నీ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.

దీంతో ప్రస్తుతం చేస్తోన్న పుష్ప ది రూల్ మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నెక్స్ట్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా క్రెడిట్ మొత్తం రాజమౌళికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చరణ్ గేమ్ చేంజర్ తో సోలోగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో కమర్షియల్ సక్సెస్ అందుకుంటే ఆయన మార్కెట్ వేల్యూ కచ్చితంగా పెరుగుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. కమర్షియల్ హీరోగా అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న కూడా పవన్ కళ్యాణ్ ఇటు సినిమా, అటు రాజకీయాలు చేస్తూ ఉండటంతో పాన్ ఇండియా ఇమేజ్ ని అందుకోలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీతో తన స్టామినా చూపించుకునే పనిలో ఉన్నారు.

అయితే మార్కెట్, బ్రాండ్ ఇమేజ్, బిజినెస్, రికార్డ్స్, నాన్ థీయాట్రికల్ రైట్స్ పరంగా మెగా హీరోలలో బన్నీనే టాప్ చైర్ లో ఉన్నాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఐకాన్ స్టార్ ఇమేజ్ హైలెవల్ కి వెళ్ళడానికి కారణం పుష్ప మూవీ అని చెప్పాలి. పుష్ప ది రూల్ తో బ్లాక్ బస్టర్ కొట్టి 1000 కోట్ల క్లబ్ లో చేరితే ఇమేజ్ పరంగా అతన్ని మ్యాచ్ చేయలేరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక పుష్ప 2 సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాతో ఎలాగైనా సాలీడ్ సక్సెస్ అందుకోవాలని బన్నీ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మరి సినిమా ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై Pawan Kalyan తో చర్చ | Vizag Steel Plant Employees

Posted : October 7, 2024 at 1:16 pm IST by ManaTeluguMovies

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై Pawan Kalyan తో చర్చ | Vizag Steel Plant Employees

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad