Advertisement

వకీల్ సాబ్ బ్యూటీ వీటికి మాత్రమేనా..?

Posted : May 26, 2023 at 8:10 pm IST by ManaTeluguMovies

మల్లేశం సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన తెలుగు అమ్మాయి అనన్య నాగల్ల. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిల కు అవకాశాలు ఇవ్వరు అన్న టాక్ ఉంది కానీ ఈమధ్య మన వాళ్లు కూడా ఇక్కడ వారికి ఛాన్స్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలో మల్లేశం సినిమాతో అనన్య నాగల్ల అనే మరో తెలుగు అమ్మాయి కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్యా ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటించింది. ఆ సినిమాలో ముగ్గురు ఇంపార్టెంట్ రోల్స్ లో ఒకరిగా నటించింది అనన్యా. ఆ సినిమాతో అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

అంతకుముందు అనన్య నాగల్ల ఎవరో తెలియని వారు కూడా వకీల్ సాబ్ సినిమా తర్వాత ఆమెను ఫాలో అవడం మొదలు పెట్టారు. ఇక సోషల్ మీడియాలో తనకు వచ్చిన ఈ పాపులారిటీని వాడుకుంటూ రకకాల ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది అనన్య నాగల్ల. వకీల్ సాబ్ తర్వాత మరోసారి సైడ్ రోల్స్ కే పరిమితమైంది అనన్యా. నితిన్ మాస్ట్రో ఊర్వశివో రాక్షసివో శాకుంతలం లాంటి సినిమాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో కనిపించింది అనన్యా. ఎలాగైనా సరే సినిమాల్లో కనిపించాలని చేస్తుందో లేక తను ఈ పాత్రలకే పర్ఫెక్ట్ అని తీసుకుంటున్నారో తెలియదు కానీ అనన్య నాగల్ల సోషల్ మీడియాలో ఊపు చూస్తే కచ్చితంగా హీరోయిన్ మెటీరియల్ అనిపిస్తుంది.

తీరా అమ్మడు చేసే సినిమాలు చూస్తే మాత్రం ఏదో సైడ్ రోల్స్ కే పరిమితమవుతుంది. అనన్యా కరెక్ట్ గా దృష్టి పెట్టలేదు కానీ ఈ ఫోటో షూట్స్ మీద పెట్టే శ్రద్ధ సినిమాల సెలక్షన్ లో పెడితే తప్పకుండా అనన్య నాగల్ల నెక్స్ట్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. తనని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కి మాత్రం ఏమాత్రం లోటు లేకుండా తన అందాలతో అలరిస్తుంది అనన్యా. హీరోయిన్ గా రాణించాలంటే ఫోటో షూట్స్ కంపల్సరీ కానీ సినిమాలు కాకుండా కేవలం ఫోటో షూట్స్ మాత్రమే చేస్తానంటే మాత్రం కుదరదు.

గ్లామర్ ఫీల్డ్ లో తమని తాము ప్రమోట్ చేసుకోవడం కోసం ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ ఫోటో షూట్స్ అవసరమే కానీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతున్న అనన్య ని చూసి అవకాశాలు రాకనే ఇలా చేస్తుందని క్లారిటీ వస్తున్నారు. మరి అనన్య కి తన టాలెంట్ కు తగిన ఛాన్స్ వచ్చి తన రేంజ్ పెంచే సినిమాలు రావాలని ఆశిద్దాం.


Advertisement

Recent Random Post:

MAA విధించిన సస్పెన్షన్ పై స్పందించిన Karate Kalyani

Posted : May 26, 2023 at 3:27 pm IST by ManaTeluguMovies

Watch MAA విధించిన సస్పెన్షన్ పై స్పందించిన Karate Kalyani

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement