Advertisement

వీడియో : అల్లు అర్హ పద్యంకి బాలయ్య ఫిదా

Posted : November 19, 2024 at 2:52 pm IST by ManaTeluguMovies

సాధారంగా ఈతరం పిల్లలకు తెలుగు మాట్లాడటమే సరిగా రావడం లేదు. ఇక సెలబ్రెటీ పిల్లలు ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ ఉంటారు, వారికి మినిమం తెలుగు రాదు. చాలా మంది స్టార్‌ కిడ్స్ చూస్తే తెలుగు మాట్లాడలేక ఇంగ్లీష్‌లో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది అల్లు అర్జున్‌ బిడ్డ అల్లు అర్హ తెలుగు మాట్లాడిన విధానంకు బాలకృష్ణ సైతం అవాక్కయ్యాడు. తెలుగులో మాట్లాడటం మాత్రమే కాకుండా తెలుగులో అర్హ పాడిన పద్యం ప్రతి ఒక్కరికి షాక్‌గా ఉంది. అర్హ గంటా పథంగా పాడిన పద్యం తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షో లో పుష్ప 2 ప్రమోషన్‌లో భాగంగా అల్లు అర్జున్‌ పాల్గొన్నాడు. పుష్ప 2 కచ్చితంగా మరో లెవల్‌లో ఉంటుంది అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. అన్‌స్టాపబుల్‌ షో లో అల్లు అర్జున్‌తో పాటు ఆయన తల్లి కూడా పాల్గొన్నారు. ఆమె వచ్చిన ప్రోమోను ఇటీవలే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు అయాన్‌, అల్లు అర్హలు ఉన్న ప్రోమోను విడుదల చేయడం జరిగింది. నవంబర్‌ 22న స్ట్రీమింగ్‌ కాబోతున్న ఈ ఎపిసోడ్‌ కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్హని తెలుగు వచ్చా అని ప్రశ్నించగా వచ్చిన సమాధానం అదిరి పోయింది.

సరదాగా ముచ్చటించిన బాలకృష్ణ.. అర్హ నీకు తెలుగు వచ్చా అమ్మ అంటూ ప్రశ్నించగా అల్లు అర్జున్‌ కల్పించుకుని, తెలుగు వచ్చా… అంటూ గట్టిగా అని పద్యం పాడించాడు. తెలుగు పద్యంను గుక్కతిప్పుకోకుండా 15 సెకన్లు పాడిన అల్లు అర్హను దగ్గరకు తీసుకుని బాలకృష్ణ ముద్దు పెట్టి, తెలుగు చల్లగా, నాలుగు కాలాల పాటు ఈ భూమి మీద బతుకుతుంది అనిపిస్తుందని బాలయ్య అన్నారు. అర్హ ప్రతిభకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అర్హను ఏ క్లాస్ అంటూ బాలకృష్ణ ప్రశ్నించగా సెకండ్‌ క్లాస్ అంటూ సమాధానం ఇచ్చింది. నేను ఫస్ట్ క్లాస్ అంటూ బాలయ్య సరదాగా చెప్పగానే అర్హ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ అల్టిమేట్‌ అనిపించింది.

మీ డాడి మొత్తం ప్రేమ మీ చెల్లి మీదేనా అంటూ అయాన్‌ను ప్రశ్నించగా లేదు నా మీదే అంటూ అయాన్‌ అన్నాడు. యానిమల్ సినిమాలో రణబీర్‌ కపూర్‌ నాన్న కోసం ఏమైనా చేసినట్లు, నా కోసం అయాన్‌ ఏమైనా చేస్తాడు అంటూ మురిపెంగా అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో అయాన్‌, అర్హ కనిపించడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి షో కు వారు రావడం మొదటి సారి. సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా వాళ్లని చూస్తాం కానీ ఒక టాక్ షో లో వారు మాట్లాడటంతో కచ్చితంగా ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. అల్లు అర్జున్‌ పుష్ప 2 డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది. ఇటీవల వచ్చిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.


Advertisement

Recent Random Post:

శ్రీశైలం సమీపంలో కారు ప్రమాదం | Car Accident At Srisailam

Posted : November 30, 2024 at 11:44 am IST by ManaTeluguMovies

శ్రీశైలం సమీపంలో కారు ప్రమాదం | Car Accident At Srisailam

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad