Advertisement

వెంకీ, అనిల్‌ మూవీ.. పల్లెటూరు+మెసేజ్‌

Posted : February 7, 2024 at 7:00 pm IST by ManaTeluguMovies

సీనియర్ హీరో వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి “సైంధవ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు వెంకటేష్ ఓకే చెప్పారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

వెంకీ, అనిల్ రావిపూడి కాంబో మూవీ ఒక అందమైన కథా చిత్రం అని తెలుస్తోంది. పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక చక్కని మెసేజ్ కూడా ఉండబోతోంది.

సినిమాలో పల్లెటూరును వదిలి, తల్లిదండ్రులను వదిలి పట్నం వెళ్లిన ఒక యువకుడి కథను చూపించబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన గ్రామాన్ని మరిచిపోవద్దు అనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇవ్వబోతున్నారట.

దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన “శతమానం భవతి” తరహాలోనే ఈ సినిమా ఉంటుందని కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి పల్లెటూరు నేపథ్యం, మంచి మెసేజ్, సంక్రాంతి రిలీజ్ వంటి అంశాలతో ఈ సినిమా వెంకటేష్ కి చాలా కాలం తర్వాత ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ ను అందించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి 2025కి ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.


Advertisement

Recent Random Post:

150 ఏళ్ల సినిమా చెట్టుకు చిగుళ్లు | 150-Year-Old Film Shooting Tree | Kumaradevam

Posted : October 9, 2024 at 12:53 pm IST by ManaTeluguMovies

150 ఏళ్ల సినిమా చెట్టుకు చిగుళ్లు | 150-Year-Old Film Shooting Tree | Kumaradevam

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad