Advertisement

షారూఖ్‌-ర‌జ‌నీ క‌ల‌యిక ది బెస్ట్ డైరెక్ట‌ర్‌తో

Posted : April 11, 2024 at 5:40 pm IST by ManaTeluguMovies

భార‌తీయ సినీచ‌రిత్ర‌లో అత్యంత క్రేజీ కాంబినేష‌న్ ఏది? అంటే దీనికి ఇన్నాళ్టికి స‌రైన‌ స‌మాధానం ల‌భించింది. దేశంలోని ఉత్త‌రాది- ద‌క్షిణాదికి చెందిన‌ ఇద్ద‌రు అగ్ర‌శ్రేణి హీరోల క‌ల‌యికను చాలా సార్లు చూశాం. కానీ ఇది ప్ర‌త్యేక‌మైన‌ అరుదైన క‌ల‌యిక‌. ద‌క్షిణాది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్- ఉత్త‌రాది సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్‌ల అరుదైన క‌ల‌యిక‌.

ఇది నిజానికి షారూఖ్ – స‌ల్మాన్ ఖాన్‌ల క‌ల‌యిక కంటే ప‌వ‌ర్‌ఫుల్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియా ట్రెండ్ లో ఇది రేర్ ఫీట్ గా భావించాల్సి ఉంటుంది. దేశంలోని రెండు విభిన్న‌ ప్రాంతాల నుంచి భారీ బిజినెస్ కి ఆస్కారం ఉన్న స్టార్స్ క‌ల‌యిక‌గా దీనిని చూడొచ్చు. దీనిని

తలైవర్ 171 తో సాధ్యం చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. రజనీకాంత్ + షారూఖ్ ఖాన్? క‌ల‌యిక సాధ్య‌మేనా? అన్న సందేహాల‌కు చెక్ పెడుతూ ఆ ఇద్ద‌రినీ క‌లుపుతూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ భారీ సాహ‌స‌మే చేస్తున్నార‌ని టాక్ బ‌లంగా ఉంది. రా-వన్ తర్వాత సూపర్‌స్టార్స్ మళ్లీ కలిసి న‌టిస్తున్నారు. అయితే రా-వ‌న్‌లో ర‌జ‌నీ పాత్ర చాలా చిన్న‌ది కానీ ఇప్పుడు అలా కాదు!

దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమా కోసం చాలా సాహ‌సాలు చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా తలైవర్ 171 అని పేరు పెట్టారు. దీనిపై ర‌జ‌నీ అభిమానులలో గొప్ప ఉత్సాహం నెల‌కొంది. ర‌జ‌నీ-లోకేష్ రేర్ కాంబినేష‌న్ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని వారంతా బ‌లంగా న‌మ్ముతున్నారు. క‌నగరాజ్ గతంలో కైతి, మాస్టర్, విక్రమ్, లియో వంటి కొన్ని అద్భుతమైన హిట్‌లను అందించినందున ర‌జ‌నీ అభిమానులు త‌మ‌ ప్రశాంతత‌ను కోల్పోతూ అప్‌డేట్ ల కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఇది పెద్ద వార్త‌.

`రా వన్` తర్వాత షారుఖ్‌, రజనీకాంత్ క‌ల‌యిక అన‌గానే దీనిపై భారీ అంచ‌నాలేర్ప‌డుతున్నాయి. షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో ప్రత్యేకంగా కనిపించాలని మేకర్స్ కోరుకుంటున్నారని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి వ‌ల్ల‌మాలిన అభిమానం. ఇది అద్భుత‌మైన కెమిస్ట్రీకి ఆస్కారం క‌ల్పిస్తుంద‌ని కూడా భావిస్తున్నారు. రజనీకాంత్‌ను షారుక్ ఎంతగా అభిమానిస్తాడో తెలిసిందే. 2011 చిత్రం రా-వన్‌లో సౌత్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ కాంత్ `చిట్టి ది రోబో`గా కనిపించాడు. 2013లో లుంగీ డ్యాన్స్‌తో తలైవాకు నివాళులర్పించారు SRK. అయితే ఇప్పటివరకు తలైవర్ 171లో ఖాన్ అతిధి పాత్ర గురించి ఎటువంటి అధికారిక నిర్ధారణ లేదు.

ఒకానొక ద‌శ‌లో ఖాన్ సున్నితంగా ఈ ఆఫ‌ర్ ని తిర‌స్క‌రించార‌ని కూడా టాక్ వినిపించింది. కానీ ఏదీ అధికారికంగా లేదు. SRK తో పాటు ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో న‌టించాల్సిందిగా విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నట్లు కూడా ఊహాగానాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ గతంలో మాస్టర్, విక్రమ్ సినిమాలలో సేతుప‌తితో కలిసి పనిచేశారు. అందువ‌ల్ల ఈ ఊహాగానాలు సాగుతున్నాయి.

రజనీకాంత్- లోకేష్ కాంబినేష‌న్ సినిమా హాలీవుడ్ చిత్రం `పర్జ్` (2013) నుండి ప్రేరణ పొందిందని గతంలో క‌థ‌నాలొచ్చాయి. ఒకే ఒక్క రాత్రి ఎవ‌రు ఎలాంటి నేరాలు అయినా చేయొచ్చు.. హ‌త్య‌లు కూడా చేయొచ్చు.. కానీ చ‌ట్టం ఏమీ చేయ‌ద‌నే జీవో జారీ అవుతుంది. ఆ ఒక్క‌ రాత్రిలో ఏం జ‌రిగింద‌నే క‌థ‌తో ఈ సినిమాని లోకేష్ క‌న‌గ‌రాజ్ రూపొందిస్తున్నారు. హ‌త్య‌లు నేరాల‌కు చ‌ట్టంలో లొసుగు క‌ల్పిస్తే ధ‌న‌వంతులు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే. హాలీవుడ్ చిత్రం ప‌ర్జ్‌లో ఏతాన్ హాక్, లీనా హెడ్, అడిలైడ్ కేన్ , మాక్స్ బర్ఖోల్డర్ నటించారు. అయితే కనగరాజ్ సినిమా కోసం కేవ‌లం హాలీవుడ్ థ్రిల్లర్ థీమ్‌ని మాత్ర‌మే తీసుకుని నేటివిటీకి త‌గ్గ‌ట్టు రూపొందిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇవేవీ అధికారికంగా నిర్ధార‌ణ లేని క‌థ‌నాలు. వాటిపై లోకేష్ స్వ‌యంగా స్పందిస్తారేమో చూడాలి.

విల‌న్ ఎవ‌రు?

రజనీకాంత్ లాంటి స్టార్ ముందు విలన్ గా నిల‌వాలంటే.. న‌టుడు ఎవ‌రైనా బెదిరిపోవాల్సిందే. కానీ ఇందులో మైక్ మోహన్ ప్రతినాయకుడిగా నటించవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. బ్యాడీగా నటించాల‌ని ఇప్ప‌టికే లోకేష్ టీమ్ మోహన్‌ను సంప్రదించింది. ఇది ఖరారైతే త్వరలోనే ప్రకటిస్తార‌ని తెలిసింది. నూరవతు నాల్, సుత్త పజం, పయనంగల్ ముడివత్తిల్లై త‌దిత‌ర చిత్రాల్లో మోహ‌న్ న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది. ఇప్పుడు ర‌జ‌నీతో ఆఫ‌ర్ అంటే మోహ‌న్ కి ఇది క‌లిసొస్తుంద‌ని అంచ‌నా.


Advertisement

Recent Random Post:

AP E Office Files || ఏపీలో ప్రభుత్వ ఫైళ్లకు ‘అనుమానపు’ నిప్పు! || AP News

Posted : May 18, 2024 at 3:00 pm IST by ManaTeluguMovies

AP E Office Files || ఏపీలో ప్రభుత్వ ఫైళ్లకు ‘అనుమానపు’ నిప్పు! || AP News

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement