Advertisement

సామ్ బ‌హ‌దూర్ ట్రైల‌ర్: గెలిచి తీర్తాన‌నే యుద్ధ వీరుడి పంతం

Posted : November 8, 2023 at 7:07 pm IST by ManaTeluguMovies

విక్కీ కౌశల్ న‌టించిన ‘సామ్ బహదూర్’ ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రలు పోషించారు. రోనీ స్క్రూవాలా నిర్మించారు. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఒక యుద్ధ వీరుడి ప‌ట్టుద‌ల పంతం ఎలా ఉంటుందో ప్ర‌తి ఫ్రేమ్ లో ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే- చిత్ర బృందం సమక్షంలో ట్రైల‌ర్ ని ఆవిష్కరించారు. ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా నిజ జీవిత క‌థ ఇది. ఇందులో టైటిల్ పాత్ర‌లో విక్కీ కౌశ‌ల్ అద్భుతంగా న‌టించారు. ముఖ్యంగా సామ్ మానేక్ష బాడీ లాంగ్వేజ్ ని అత‌డు అన్వ‌యించుకున్న తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది. చూసే చూపు.. న‌డ‌క‌.. న‌డ‌త‌.. ఆహార్యం ప్ర‌తిదీ సామ్ మానేక్ష‌ను పోలి ఉండాల‌ని అత‌డు చేసిన ప్ర‌య‌త్నం ఆక‌ట్టుకుంది. మానేక్ష భార్య‌ పాత్ర‌లో ఫాతిమా స‌నా షేక్ న‌టించింది. ఇండియా పాక్ బార్డ‌ర్లో యుద్ధం.. నాటి రాజ‌కీయాలను ఈ ట్రైల‌ర్ లో స్పృషించారు. నాటి రాజ‌కీయాల్లో ఇందిర‌మ్మ‌ కోణం ఇందులో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా, ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా ఆన్ స్క్రీన్‌పై నటించడం తనకు ఎంత సవాల్ గా నిలిచిందో విక్కీ కౌశల్ వెల్ల‌డించారు. విక్కీ మాట్లాడుతూ, “నన్ను ఈ సినిమాలో నటించే అవ‌కాశం క‌ల్పించినందుకు ఫిలింమేక‌ర్ మేఘనా గుల్జార్‌కి కృతజ్ఞతలు. రాజీ చిత్రీకరిస్తున్నప్పుడు మేఘ‌న‌ మొదట నాతో స్క్రిప్ట్‌ను ప్రస్తావించినప్పుడు, నేను అతడి(సామ్ మానేక్ష‌) కోసం వెతికాను. నేను అతని గురించి చాలా విన్నాను కాబట్టి అతను ఎలా ఉన్నాడో ప‌రిశోధించాను. సామ్ మానెక్షా ఎలా కనిపిస్తున్నాడో ఎప్పుడూ చూడలేదు. నేను అతడిని మొదటిసారి చూసినప్పుడు అతడు చాలా అందంగా ఉన్నాడు అనుకున్నాను. ఈ పాత్ర నాకు ఎప్పటికీ రాదని నేను అనుకున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేఘనకు కృతజ్ఞతలు… అని అన్నారు.

ఈ చిత్రంలో భారతదేశపు యుద్ధ వీరుడు.. మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా పాత్రను విక్కీ కౌశ‌ల్ పోషించారు. త‌న పాత్ర గురించి విక్కీ మాట్లాడుతూ..”ఇది నేను ఇప్పటివరకు పోషించిన కష్టతరమైన పాత్ర,.. మానేక్ష‌ ఎలా మాట్లాడతాడు? ఎలా నడుచుకుంటాడు? అనే దాని గురించి మాత్రమే కాదు.. అలాంటి వ్యక్తి కారణంగా నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇది నిజంగా మేఘన అండ టీమ్ ఎఫర్ట్ .. భారీ రీసెర్చ్ వర్క్ జ‌రిగింది.. అని తెలిపారు. సామ్ మానేక్షా గుణగ‌ణాల గురించి ప్ర‌శ్నించ‌గా.. అత‌డు ఇలా అన్నాడు. సామ్ మానేక్ష‌ 40 ఏళ్ల కెరీర్‌లో అతిపెద్ద విజయం ఏమిటి? అని అడిగారు. అతడు తన జవాన్లలో ఎవరినీ శిక్షించలేదని విక్కీ చెప్పాడు. అన్ని అధికారాలు ఉన్నప్పటికీ అత‌డిలోని కరుణను నేను నిజంగా ఆరాధిస్తాను అని కూడా అన్నారు.

ఫాతిమా సనా షేక్ -సన్యా మల్హోత్రా మాట్లాడుతూ, దర్శకురాలు తమ పాత్రల స్కిన్‌లోకి రావడానికి సహాయం చేసార‌ని, సామ్ భార్య అయిన సిల్లూ మానేక్షా పాత్రను పోషించడానికి తాను చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నించాన‌ని కూడా సన్యా తెలిపింది. ఆమె పాత్ర గురించి చదివి, చాలా పరిశోధన చేసారు… అని తెలిపారు.

విక్కీ త‌దుప‌రి కెరీర్ గురించి వివ‌రాలు చూస్తే… దర్శకుడు ఆనంద్ తివారీ రొమాంటిక్ చిత్రంలో ట్రిప్తి డిమ్రీ – అమీ విర్క్‌లతో కలిసి విక్కీ కూడా కనిపిస్తాడు. కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం 23 ఫిబ్రవరి 2024న థియేటర్లలోకి రానుంది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తదుపరి చిత్రం ‘చావా’లో న‌టించాడు. రష్మిక మందన్న క‌థానాయిక‌. 6 డిసెంబర్ 2024న థియేటర్లలోకి రానుంది.


Advertisement

Recent Random Post:

Megastar Chiranjeevi Place in Guinness Book Of World Records | For his Excellence in Film Journey

Posted : September 22, 2024 at 7:49 pm IST by ManaTeluguMovies

Megastar Chiranjeevi Place in Guinness Book Of World Records | For his Excellence in Film Journey

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad