Advertisement

సీనియర్ తో జూనియర్.. ఎన్నాళ్లకో త్రివిక్రమ్ ఇలా!

Posted : April 27, 2024 at 7:23 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె విజ‌య్ భాస్క‌ర్ అంటే ఇప్పుడున్న జనరేషన్ సరిగ్గా గుర్తు పట్టకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్ ఇట్టే గుర్తుప‌ట్టేస్తారు. నువ్వే కావాలి, మ‌న్మ‌థుడు, నువ్వు నాకు న‌చ్చావ్, జై చిరంజీవ లాంటి ఆల్‌ టైమ్ ఫ్యామిలీ బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ ల‌ను తెలుగు సినీ ప్రియులకు అందించారు విజ‌య్ భాస్క‌ర్. ఆయన ఒకప్పుడు తెరకెక్కించిన సినిమాల్లోని సీన్స్ ను ప్రజెంట్ జనరేషన్ మీమ్స్ కింద వాడేస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ లో కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు విజయ్ భాస్కర్ ‘ఉషా పరిణయం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సబ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీ కమల్ హీరోగా నటిస్తున్నారు. అచ్చ తెలుగమ్మాయి తాన్వీ ఆకాంక్ష ఈ మూవీతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కానుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ నిర్మాణ బాధ్యతలను కూడా చేపడుతున్నారు విజయ్ భాస్కర్.

అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. ఒకప్పుడు విజయ్ భాస్కర్ దగ్గర స్టోరీ డైలాగులు రాసేవారు. ఇది చాలా మందికి తెలిసినా గుర్తుండకపోవచ్చు. త్రివిక్ర‌మ్‌, విజ‌య్‌ భాస్క‌ర్ కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా విజయ్ భాస్కర్ ను త్రివిక్రమ్ కలిశారు. ఉషా పరిణయం సెట్స్ కు వెళ్లిన త్రివిక్రమ్.. మూవీ టీమ్ కు విషెస్ తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఉషా పరిణయం సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్ ఐటెం సాంగ్ చేస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ షూట్ చివరి రోజైన శుక్రవారం నాడు సెట్స్ కు వెళ్లారు త్రివిక్రమ్. విజయ్ భాస్కర్ తో పాటు టీమ్ అందరినీ కలిశారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఘ‌ల్లు.. ఘ‌ల్లు అంటూ సాగే ఐటెం సాంగ్ కోసం బ్యాక్ గ్రౌండ్ లో చేసిన లైట్ డెకరేషన్ అదిరిపోయింది. త్వరలోనే ఈ సాంగ్ ప్రోమో విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది.

యూత్‌ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఉషా పరిణయం చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ఆడియన్స్ ను అలరిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఈ మూవీలో సూర్య‌, ర‌వి, శివ‌తేజ‌, అలీ, వెన్నెల‌ కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆర్ ఆర్ ధ్రువ‌న్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత సినిమా తీస్తున్న విజయ్ భాస్కర్ ఈ మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.


Advertisement

Recent Random Post:

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ప్రశ్నల వర్షం | Pawan Kalyan’s Question to officials

Posted : June 20, 2024 at 1:08 pm IST by ManaTeluguMovies

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ప్రశ్నల వర్షం | Pawan Kalyan’s Question to officials

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement