Advertisement

సెకెండ్ ప్రీ వెడ్డింగ్ కి ఆ ఫ్యామిలీ అన్ని కోట్లా?

Posted : June 6, 2024 at 7:03 pm IST by ManaTeluguMovies

అప‌ర కుబేరుడు అంబానీ ఇంట వేడుక అంటే మామూలుగా ఉంటుందా? ఇటీవ‌లే మరోసారి ప్రూవ్ అయింది. అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చంట్ మొద‌టి ప్రీ వెడ్డింగ్ ఏ రేంజ్ లో జ‌రిగిందో తెలుసు క‌దా. ప్ర‌పంచ‌మే అంబానీ ఇంట వేడుక గురించి ఎంతో గొప్ప‌గా మాట్లాడుంది. ప్ర‌పంచ కుబురులంతా అంబానీ ఆతిధ్యం పొందారు. అందుకోసం వేల కోట్ల రూపాయ‌లు ఖర్చు చేసారు. ఇక విదేశాల్లో ఈవెంట్ జ‌రిగితే అంబానీ రేంజ్ ని చెప్ప‌డం కోసం ఇంకే స్థాయిలో సెల‌బ్రేట్ చేస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు.

తాజ‌గా రెండ‌వ ప్రీ వెడ్డింగ్ వేడుక ఇట‌లీలోని ఫోర్టో ఫినోల్ లో గ్రాండ్ గా జ‌రిగింది. ఈ వేడుక‌లో సుమారు 800 మంది అతిధులు పాల్గొన్నారు. సినీ, క్రీడా, వ్యాపార రంగాల‌కు సంబంధించిన దిగ్గ‌జాలంతా హాజ‌ర‌య్యారు. మ‌రి ఈ వెంట్ కోసం అంబానీ ఎంత ఖ‌ర్చు చేసాడే తెలుసా? తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపిస్తుంది. త‌న స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌కుండా అక్ష‌రాలా 7500 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసారు. ఈ వేడుక ఎంతో రిచ్ గా జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌పంచంలో ఉన్న అన్ని ర‌కాల వంట‌కాల‌తో పాటు భార‌తీయ వంట‌కాల్ని అక్క‌డ హైలైట్ చేసారు. విదేశీ రుచుల‌కంటే భార‌తీయ రుచుల్ని ఆస్వాదించడం వేడుక‌లో హైలైట్ అయిన అంశంగా ప్ర‌చారంలోకి వ‌స్తోంది. ప్ర‌పంచ‌మే అంబానీ ఇచ్చిన గ్రాండ్ ట్రీట్ గురించి ఎంతో గొప్ప‌గా చెబుతుంది. జాతీయ‌, అంతర్జాతీయ మీడియా లోనూ ఈ వేడుక‌కు ఎంతో క‌వ‌రేజ్ వ‌చ్చింది. రాధిక‌-అంబానీ వివాహం వ‌చ్చే నెల 12న ముంబైలోని జియో క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో జ‌రుగుతుంది.

మ‌రి రెండు ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల్ని ఈ రేంజ్ లో నిర్వ‌హించిన అంబానీ పెళ్లి రోజు ముందు వేడుక‌లు, పెళ్లి ఇంకే రేంజ్ లో మోతెక్కిస్తాడో చెప్పాల్సిన ప‌నిలేదు. ముంబైలో భారీ ఎత్తున రిసెప్ష‌న్ కూడా ఉంటుంది. ఆ వేడుక‌లో మ‌ళ్లీ సెలబ్రిటీలంతా హంగామా చేస్తారు. టాలీవుడ్ నుంచి కూడా కొంద‌రు ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ప్రీవెడ్డింగ్ కి రామ్ చ‌ర‌ణ్ -ఉపాస‌న హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.


Advertisement

Recent Random Post:

Hi Laila – Teaser Ft. @varshadsouza , Nikhil Thomas | Ken Royson | The Fantasia Men

Posted : December 10, 2024 at 1:34 pm IST by ManaTeluguMovies

Hi Laila – Teaser Ft. @varshadsouza , Nikhil Thomas | Ken Royson | The Fantasia Men

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad