Advertisement

సెటైర్ వేసినా సైలెంట్ గా ఉన్నాడేంటి?

Posted : September 11, 2024 at 7:08 pm IST by ManaTeluguMovies

`కాఫీ విత్ క‌ర‌ణ్` టాక్ షోలో క‌ర‌ణ్ వైఖ‌రి ప్ర‌శ్న‌లు ఎలా ఉంటాయో? చెప్పాల్సిన ప‌నిలేదు. క‌ర‌ణ్ తెలివిగా ప్ర‌శ్న‌లు వేసి అడ్డంగా బుక్ చేయ‌డం అత‌డికి ఓ అల‌వాటు లాంటింది. ప్ర‌తిగా అప్పుడ‌ప్పుడు తాను కూడా కౌంట‌ర్లు ఎదుర్కుంటాడు. ఇక కొత్త కుర్రాళ్లు దొరికారంటే క‌ర‌ణ్ వార్ వ‌న్ సైడ్ అయిపోతుంది. కుర్రాళ్ల‌ను తిక‌మ‌క పెట్టి మీడియాలో హైలైట్ చేస్తుంటాడు. కానీ నిన్న‌టి రోజున ముంబై లో జ‌రిగిన ఐఫా ప్రీ వేడుక‌లో క‌ర‌ణ్ జోహార్ నే ఆడుకున్నాడు షారుక్ ఖాన్.

ఐఫా 2024 పెస్టివ‌ల్ కు రంగం సిద్ద‌మ‌వుతోంది. ఈనెల 27,29 తేదీల్లో గ్రాండ్ గా ఈవెంట్ అబుదాబిలోని యాస్ దీవులలో జ‌రుగుతుంది. ఈసారి బాలీవుడ్ నుంచి ఈ ప్రోగ్రామ్ ని క‌ర‌ణ్ జోహార్, షారుక్ ఖాన్ లు హోస్ట్ చేస్తున్నారు. తెలుగు నుంచి రానా ఆబాధ్య‌త‌లు తీసుకున్నాడు. అయితే దీనికి సంబంధించి క‌ర్టైన్ రైజ‌ర్ ముంబైలో జరిగింది. దీనికి షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, అభిషేక్ బెనర్జీ, రానా దగ్గుబాటి , సిద్ధాంత్ చతుర్వేది తదితరులు హాజరయ్యారు.

దీనిలో భాగంగా షారుఖ్ ఖాన్ `స్త్రీ 2`లో అభిషేక్ బెనర్జీ అత్యుత్తమ నటనకు ప్రశంసలు కురిపించాడు. ఈ సంద‌ర్భంలో షారుక్ ..క‌ర‌ణ్ పై సెటైర్లు వేసారు.`కరణ్ దయచేసి రిహార్సల్స్ కోసం రండి. అతను రిహార్సల్ చేసే మానసిక స్థితిలో లేడు. జూమ్ కాల్స్‌లో చేస్తానని చెప్పాడు మీరు ఎలా హోస్ట్ చేస్తారో చూస్తాను` అని షారుఖ్ అన‌గా దానికి కరణ్ జోహార్ బిగ్గ‌ర‌గా న‌వ్వాడు. ఆ స‌మ‌యంలో క‌ర‌ణ్ కౌంట‌ర్ ఇస్తాడు? అనుకుంటే సైలెంట్ గా న‌వ్వేసి ఊరుకోవ‌డం కొంద‌రి చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇదేంటి అంద‌ర్నీ ఇరికించే క‌ర‌ణ్ సైలెంట్ గా ఉన్నాడంటూ గుస గుస‌లాడుకున్నారు. ఐఫాని షారుక్ ద‌శాబ్దం త‌ర్వాత హోస్ట్ చేయ‌డం విశేషం. ఈవెంట్ కి బాలీవుడ్ తారా తోర‌ణమంతా దిగొస్తుంది. రేఖ, షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్ , కృతి సనన్ పేర్లు ఇప్ప‌టికే లీక్ అయ్యాయి.


Advertisement

Recent Random Post:

ఏడవ రోజు కొనసాగుతున్న బోట్ల తొలగింపు.. బోట్లు బయటపడేనా..? | Prakasam Barrage |

Posted : September 16, 2024 at 10:40 pm IST by ManaTeluguMovies

ఏడవ రోజు కొనసాగుతున్న బోట్ల తొలగింపు.. బోట్లు బయటపడేనా..? | Prakasam Barrage |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad