ఓ పక్క మిగతా స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో అదరగొట్టేస్తుంటే స్టార్ లెగసీ ఉన్న అక్కినేని ఫ్యామిలీ హీరోలు మాత్రం ఇంకా వెనకబడి ఉన్నారని చెప్పొచ్చు. నాగ చైతన్య ఒక్కడే ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య కస్టడీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ ని కూడా షాక్ అయ్యేలా చేస్తాడట నాగ చైతన్య. చందు మొందేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ పై ఇప్పటికే బజ్ ఒక రేంజ్ లో ఉంది.
ఇక కింగ్ నాగార్జున ఈ ఇయర్ మొదట్లో నా సామి రంగతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా హిట్ ఇచ్చిన కిక్ తో నాగ్ వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాగార్జున ధనుష్ కుబేర సినిమాతో పాటుగా రజినీ సినిమాలో కూడా నటిస్తున్నాడని టాక్ ఉంది. అక్కినేని యువ హీరో అఖిల్ మాత్రం తన కెరీర్ స్ట్రగుల్ కొనసాగిస్తున్నాడు. బ్యాచిలర్ తో ఎలాగోలా సక్సెస్ అందుకున్నాడు అనుకున్న అఖిల్ ఏజెంట్ తో మరో డిజాస్టర్ అందుకున్నాడు.
అఖిల్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే రీసెంట్ గా నాగార్జున, అఖిల్ కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకున్నారు. కథ కూడా ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని వార్తలు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నారని చెప్పుకొచ్చారు. స్టోరీ నాగార్జునకు నచ్చినా అఖిల్ ఆ సినిమాలో చేసేందుకు నిరాకరించాడని టాక్. అందుకే నాగార్జున కూడా ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడని అంటున్నారు.
అఖిల్ కెరీర్ మీద నాగార్జున ఎంత స్పెషల్ ఫోకస్ చేద్దామని అనుకున్నా చినబాబు మాత్రం తనకు నచ్చిన సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే నాగార్జున అఖిల్ సినిమాల విషయంలో జోక్యం చేయట్లేదని తెలుస్తుంది. ఏజెంట్ సినిమాకు అఖిల్ బాగా కష్టపడినా ఫలితం నిరాశపరచడంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. అయితే ఒక మంచి కమర్షియల్ హిట్ సినిమా కోసం అఖిల్ వెతుకుతున్నాడు. తను సోలోగా హిట్ కొట్టిన తర్వాతనే నాగార్జునతో మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడట అఖిల్. అందుకే నాగార్జున, అఖిల్ మల్టీస్టారర్ సినిమా హోల్డ్ లో పెట్టారని చెప్పుకుంటున్నారు.