Advertisement

ఆ హీరోయిన్ల‌పై విజ‌య్, విజ‌య్ పై ర‌కుల్!

Posted : March 23, 2020 at 12:38 pm IST by ManaTeluguMovies

ఈ మ‌ధ్య‌కాలంలో సినిమా వాళ్లు త‌మ సాటి హీరోలు, హీరోయిన్ల ప‌ట్ల త‌మ క్రేజ్ ను ఓపెన్ గానే చెబుతున్నారు. వాళ్ల‌తో న‌టించాల‌ని ఉందంటూ ప్ర‌క‌ట‌న‌లే చేసేస్తూ ఉన్నారు. త‌మ సాటి న‌టీన‌టుల ప‌ట్ల త‌మ ఫిల్మీ క్ర‌ష్ ను వీళ్లు ఇలా ఓపెన్ గానే వివ‌రించేస్తూ ఉన్నారు. ఆ మ‌ధ్య శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ మాట్లాడుతూ.. త‌న‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టించాల‌ని ఉందంటూ చెప్పింది. ఇలా సౌత్ హీరోపై ఆ బాలీవుడ్ హీరోయిన్ త‌న ఫిల్మీ క్ర‌ష్ ను ప్ర‌క‌టించింది.

ఇక విజ‌య్ కూడా జాన్వీ తో ప‌ని చేయ‌డానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడ‌ట‌. ఈ మ‌ధ్య‌నే ఈ హీరో ఆ విష‌యాన్ని చెప్పాడు. జాన్వీ క‌పూర్, కియ‌రా అద్వానీ.. వీళ్లిద్ద‌రితో న‌టించాల‌ని ఉందంటూ విజ‌య్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటి వాటి గురించి చెప్పాడు. కియ‌రాతో ఇప్ప‌టికే విజ‌య్ కు స్నేహం ఉన్న‌ట్టుంది. మ‌రి వీరిద్ద‌రూ ఎప్పుడు క‌లిసి న‌టించ‌బోతున్నారో!

బాలీవుడ్ లో అలా లీడింగ్ లో ఉన్న జాన్వీ, కియ‌రాల మీద విజ‌య్ అలా త‌న ఆస‌క్తిని వ్య‌క్తం చేయ‌గా, విజ‌య్ తో ప‌ని చేయాల‌ని ఉందంటూ త‌న మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ప్ర‌స్తుతం హీరోయిన్ గా ర‌కుల్ హ‌వా కొంత త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈమె విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టించాల‌ని ఉందంటూ, అత‌డి న‌ట‌నాప‌టిమ‌ను ప్ర‌శంసించేసింది. ఇలా సినీతారలు ఒక‌రి మీద మ‌రొక‌రు త‌మ ఫిల్మీ క్రష్ ల‌ను వ్య‌క్తం చేసుకుంటూ ఉన్నారు! ఈ విష‌యంలో వారు బేష‌జాలు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టుగా ఉన్నారు.


Advertisement

Recent Random Post:

ప్రమాదం ఎలా జరిగిందో ఎక్స్ క్లూజివ్ గ్రాఫిక్స్ విజువల్స్|Goods train rams into Kanchanjungha Express

Posted : June 17, 2024 at 3:16 pm IST by ManaTeluguMovies

ప్రమాదం ఎలా జరిగిందో ఎక్స్ క్లూజివ్ గ్రాఫిక్స్ విజువల్స్|Goods train rams into Kanchanjungha Express

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement