Advertisement

ఇన్నాళ్లకు టిల్లు లుక్ మారింది..!

Posted : July 18, 2024 at 7:32 pm IST by ManaTeluguMovies

సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం అయినా కూడా ఆయనకు సక్సెస్ దక్కింది మాత్రం ‘డీజే టిల్లు’ తో అనే విషయం తెల్సిందే. డీజే టిల్లు సినిమా కి సీక్వెల్‌ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

టిల్లు గెటప్ తోనే సిద్దు గత మూడు సంవత్సరాలుగా మీడియా కు కనిపిస్తున్నాడు. బయట ఏ కార్యక్రమం జరిగినా కూడా టిల్లు మూవీ లో ఎలా అయితే కనిపించాడో అలాగే కనిపిస్తున్నాడు. మాస్ లుక్ లో సిద్దు ను చూసి బోర్ కొడుతుంది అనుకున్న వారికి తన కొత్త లుక్ ను సిద్దు చూపించాడు.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా అనే సినిమాలో నటించబోతున్నాడు. ఇటీవలే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ ను రివీల్‌ చేయడం జరిగింది. స్టైలిష్ లుక్ లో చాలా హ్యాండ్సమ్‌ గా సిద్దు జొన్నలగడ్డ కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సిద్దు కు గుర్తింపు మరియు స్టార్‌ డమ్‌ తెచ్చి పెట్టిన టిల్లు లుక్ నుంచి బయటకు వచ్చాడు. డీజే టిల్లు మరియు టిల్లు స్క్వేర్‌ సినిమాల తర్వాత సిద్దు చేస్తున్న సినిమా తెలుసు కదా సినిమా చేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమా పై ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రాబోతున్న 30వ సినిమా ఇదే కావడం విశేషం.

ఈ సినిమాకు మ్యూజిక్‌ ని థమన్‌ అందించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందనున్న ఈ సినిమా లో సిద్దు లుక్‌ కి మంచి మార్కులు పడ్డాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

భారీ వర్షాలతో వణికిపోతున్న విజయవాడ | Heavy Rains in Vijayawada

Posted : September 1, 2024 at 8:54 pm IST by ManaTeluguMovies

భారీ వర్షాలతో వణికిపోతున్న విజయవాడ | Heavy Rains in Vijayawada

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement