Advertisement

ఊర్వశి ప్రార్ధనలన్నీ పంత్ కోసమేనా?

Posted : December 30, 2022 at 10:25 pm IST by ManaTeluguMovies

క్రికెటర్ రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. కొద్ది సేపటి క్రితమే పంత్ ఆరోగ్యానికి సంబంధించి బీసీసీ లేఖ కూడా రిలీజ్చేసింది. భయపడాల్సిన పనిలేదని…ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆ లేఖలో పేర్కొన్నారు.

దీంతో పంత్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు.. క్రీడాభిమానులు..రాజకీయ నాయకులు..సెలబ్రిటీలంతా పోస్ట్ లు పెడుతున్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న పంత్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలే కూడా ‘ప్రార్ధిస్తున్నాను’ అని ఓ పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ పంత్ కోసమే పెట్టినట్లు మీడియాలో హైలైట్ అవుతుంది. ఇద్దరికీ మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా పంత్..ఊర్వశీ రౌతేలే పలుమార్లు ఒకరిపై విమర్శలు గుప్పించుకు్న సందర్భాలున్నాయి.

నువ్వెంతంటే? నువ్వెంత అనే వరకూ వచ్చిందా తంతు. ఇద్దరు ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలోవైరల్ అవ్వడంతో రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా లో కథనాలొచ్చాయి. ఆ బంధం వీగిపోయిన తర్వాత ఈగోలతో ఒకరి పై ఒకరు దూషించుకున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత తనపై వచ్చినవన్నీ పుకార్లని పంత్ ఖండించాడు.

అటుపై కొన్ని రోజులకి స్నేహితురాలు ఇషా నెగితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు పంత్ ప్రకటించాడు. ప్రియురాల్ని ఉద్దేశించి ఓపెద్ద ప్రేమ కావ్యమే రాసాడు. దీంతో ఊర్వశితో డేటింగ్ అనేది పుకార్లని వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎవరి వృత్తులో వారు బిజీగా ఉన్నారు.

ఇంతలోనే పంత్ కుటుంబ సభ్యుల్ని సర్ ప్రైజ్ చేద్దామని రూర్కీ కి బయల్దేరాడు. కట్ చేస్తే యాక్సిడెంట్ అవ్వడంతో? సన్నివేశం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడా పంత్ త్వరగా కోలుకోవాలని ఊర్వశి ప్రార్ధనలు చేస్తుంది.


Advertisement

Recent Random Post:

Ucha Dar Babe Nanak Da (official Trailer) Dev Kharoud | Yograj Singh | Tarnvir Jagpal | 12 July 2024

Posted : June 24, 2024 at 6:29 pm IST by ManaTeluguMovies

Ucha Dar Babe Nanak Da (official Trailer) Dev Kharoud | Yograj Singh | Tarnvir Jagpal | 12 July 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement