Advertisement

ఎర్రబడ్డ రామ్ కోసం ఎగబడేస్తున్నారే..

Posted : March 12, 2020 at 12:34 pm IST by ManaTeluguMovies

‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్లో అతి పెద్ద విజయాన్నందుకున్నాడు రామ్. ఈ సినిమాకు రామ్ ఓకే చెప్పినపుడు ఫాంలో లేని పూరితో సినిమా ఎందుకు.. అనవసరంగా మార్కెట్ దెబ్బ తీసుకుంటున్నాడే అంటూ కామెంట్లు చేశారు జనాలు. కానీ అనూహ్యంగా పూరీనే అతడికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాతో రామ్ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడు ఆ ప్రభావం ‘రెడ్’ సినిమా మీద స్పష్టంగా కనిపిస్తోంది.

‘రెడ్’ చిత్రానికి రామ్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ మీద రిలీజ్ ముంగిట పెద్దగా అంచనాలు లేకపోవడం వల్ల దానికి బిజినెస్ మరీ ఎక్కువేమీ జరిగిపోలేదు. రూ.20 కోట్లకు అటు ఇటుగా హక్కులు అమ్ముడయ్యాయి. కానీ ‘రెడ్’ సినిమాకు ఈజీగా రూ.30 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగేలా ఉంది. ఈ సినిమా సీడెడ్ హక్కులు రూ.4 కోట్లు పలికాయి. వైజాగ్ మినహా ఆంధ్రా జిల్లాల హక్కులు రూ.10 కోట్ల దాకా తెచ్చిపెట్టాయట.

నైజాం, వైజాగ్ ఏరియాల్లో నిర్మాణ స్రవంతి మూవీస్ సొంతంగా సినిమాను రిలీజ్ చేసుకుంటోంది. వాటి థియేట్రికల్ రైట్స్ వాల్యూ రూ.10 కోట్లకు తక్కువ ఉండదు. ఇంకా ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల హక్కులూ ఉన్నాయి. మొత్తంగా థియేట్రికల్ హక్కుల వ్యాల్యూ రూ.30 కోట్లకు చేరువగా వెళ్తున్నట్లే. డిజిటల్, శాటిలైట్ హక్కుల సంగతేంటో తెలియదు. రిలీజ్ తర్వాతే అమ్ముతారేమో చూడాలి. అవి కూడా కలుపుకుంటే ఈ చిత్రానికి రూ.35 కోట్ల మేర బిజినెస్ జరుగుతున్నట్లే. రామ్ చేసిన ఓ రీమేక్ మూవీకి ఈ స్థాయి బిజినెస్ అనూహ్యమే.


Advertisement

Recent Random Post:
Advertisement