Advertisement

క‌లిసి రాలేద‌ని పేర్లు ఇలా మార్చుకుంటున్నారా?

Posted : October 16, 2024 at 2:12 pm IST by ManaTeluguMovies

ఇండ‌స్ట్రీలో హీరోల పేర్లు మార్పు అనేది కొత్తేం కాదు. చాలా కాలంగా చాలా మంది హీరోలు పేర్లు మార్చు కున్నారు. వాళ్ల ఒరిజిన‌ల్ పేర్ల‌కు బ‌ధులుగా స్క్రీన్ పై అభిమానుల‌కు బాగా సుప‌రిచిత‌మైన పేర్ల‌తో నే క‌నిపిస్తారు. కానీ ఈ మ‌ధ్య కాలంలో న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం పేర్లు మార్చుకుంటున్నారు. ఆధ్యాత్మికని ఎక్కువ‌గా విశ్వ‌శిస్తున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ అసలు పేరు శివాజీ గైక్వాడ్. కానీ సినిమాల్లోకి వచ్చాక రజినీకాంత్ గా మార్చుకున్నారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర వర ప్రసాద్. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన చిరు. ఆ తర్వాత హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాక చిరంజీవిగా మారారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస‌లు పేరు క‌ళ్యాణ్ బాబు. సినిమాల్లోకి వ‌చ్చాక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అయ్యారు. అలాగే ర‌వితేజ అస‌లు పేరు రవిశంకర్ రాజు. ఇక నాని అసలు పేరు నవీన్ బాబు.

`అష్టా చెమ్మా` సినిమాతో నానిగా మారాడు. యువ న‌టుడు విశ్వక్ సేన్ అస‌లు పేరు దినేష్ నాయుడు. ఇంకా అడివి శేష్ అసలు పేరు సన్నీ చంద్ర. ఆకాష్ పూరి అస‌లు పేరు కాగా ఇటీవ‌ల ఆకాష్ జగన్నాథ్ గా మార్చుకున్నాడు. ఇటీవ‌లే సందీప్ కిష‌న్ కూడా న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం మార్చుకున్నాడు. సందీప్ కిష‌న్ లో `ఏ` అనే లెటర్ తీసేసి కిష్న్ గా పెట్టుకున్నాడు. తాజాగా మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా మ‌రోసారి మార్చుకున్నాడు.

ఇండ‌స్ట్రీకొచ్చిన కొత్త‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్ గానే ఉన్నాడు. ఆ త‌ర్వాత మ‌ధ్య‌లో ధర్మ‌ని తీసేసి సాయి తేజ్ గా మారాడు. తాజాగా తేజ్ స్థానంలో `దుర్గ‌`ని తెచ్చి సాయి దుర్గ తేజ్ అయ్యాడు. ఇక‌పై అత‌డి స్క్రీన్ నేమ్ ఇలాగే కొన‌సాగుతుంది.


Advertisement

Recent Random Post:

#Akhanda2 – Thaandavam 🔱 Title Theme | Balakrishna | Boyapati Srinu | Raam Achanta | Gopi Achanta

Posted : October 16, 2024 at 1:31 pm IST by ManaTeluguMovies

#Akhanda2 – Thaandavam 🔱 Title Theme | Balakrishna | Boyapati Srinu | Raam Achanta | Gopi Achanta

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad