Advertisement

కల్కి… భైరవ థీమ్ సాంగ్ ఎలా ఉంటుందంటే..

Posted : June 15, 2024 at 7:58 pm IST by ManaTeluguMovies

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సిద్ధమైన ఈ సినిమా జూన్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే కల్కి 2898 ఏడీ నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో విజువలైజేషన్, కంటెంట్ ప్రెజెంటేషన్ ఉందనే మాట వినిపిస్తోంది.

ఫ్యాన్స్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మొదటి రోజు కల్కి మూవీ సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అన్ని రికార్డులని బ్రేక్ చేసి వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం అని ట్రేడ్ పండితులు సైతం అంటున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ బిజినెస్ కంప్లీట్ అయిపొయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

వీలైనంత స్ట్రాంగ్ గా సినిమాని జనాల్లోకి తీసుకొని వెళ్లాలని చిత్ర యూనిట్ విహావిస్తోంది. అందుకే అన్ని రకాలుగా ప్రమోషన్ స్ట్రాటజీలు ఉపయోగిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కల్కి నుంచి భైరవ ఆంథమ్ ప్రోమోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫుల్ సాంగ్ ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రోమోలో దల్జీత్ దోసాంజ్, ప్రభాస్ ని ఎస్టాబ్లిష్ చేశారు.

దీనిని బట్టి సాంగ్ లో ఇద్దరు నటించినట్లు తెలుస్తోంది. అలాగే ఇండియాలోనే స్టార్ సింగర్ గా దూసుకుపోతున్న దల్జీత్ ఈ సాంగ్ ని ఆలపించడం విశేషం. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. భైరవ ఆంథమ్ కచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. దీంతో సినిమాకి మరింత ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తోంది. పంజాబీ స్టైల్ లోనే ఈ ఆంథమ్ ఉండబోతోందని ప్రోమో బట్టి అర్ధమవుతోంది.

ప్రభాస్ ని ఈ ఆంథమ్ లో ఏమైనా డాన్స్ స్టెప్పులు వేస్తాడా అనేది చూడాలి. ఇదిలా ఉంటే కల్కి2898 ఏడీ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలలో నటించారు. అలాగే స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని లీడ్ రోల్స్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కూడా ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపిస్తున్నారు. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా రాబోయే ఈ మూవీ ఎలా ఉండబోతోందనే ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొని ఉంది.


Advertisement

Recent Random Post:

Rajahmundry: ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలే కారణమా?

Posted : June 15, 2024 at 1:11 pm IST by ManaTeluguMovies

Rajahmundry: ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలే కారణమా?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement