Advertisement

కల్కి 2898AD… ఆమె క్యారెక్టర్ కూడా ఓ ట్విస్ట్

Posted : June 11, 2024 at 7:29 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ లో గ్లామరస్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ దిశా పటాని. ఈ బ్యూటీ కెరియర్ ఆరంభంలో తెలుగులో లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా నటించింది. ఆ తరువాత హిందీలో వరుస అవకాశాలు రావడంతో సౌత్ వైపు దృష్టి పెట్టలేదు. అక్కడ కమర్షియల్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. అయితే దిశా పటానికి సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే ఇన్ స్టాగ్రామ్ ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది.

సోషల్ మీడియా ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న ఇండియన్ హీరోయిన్స్ లో దిశా పటాని టాప్ లో ఉంటుంది. ఆమెకి 50 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్, హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. సినిమాలలో కూడా దిశా పటాని ఎక్కువగా గ్లామర్ రోల్స్ లలో మాత్రమే కనిపిస్తోంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు అంటే పెద్దగా కనిపించవు.

అయితే ఆమె నటిగా మరీ అంత బ్యాడ్ అయితే కాదు. కానీ దర్శక నిర్మాతలు దిశా పటానిలో ఎక్కువగా గ్లామర్ యాంగిల్ నే చూస్తారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ డార్లింగ్ ప్రభాస్ కి జోడీగా కల్కి 2898 ఏడీ సినిమాలో నటించింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా దిశా పటాని ఓ ఫ్రేమ్ లో కనిపించింది. సినిమాలో ప్రభాస్, దిశా పటాని మధ్య మంచి డాన్స్ బేస్డ్ సాంగ్స్ ఉన్నాయని ఇప్పటికే టాక్ బయటకొచ్చింది.

ఈ నేపథ్యంలో కల్కి 2898ఏడీలో కూడా దిశా పటాని పాత్ర అలాగే ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. అయితే టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన సినిమాలలో క్యాస్టింగ్ విషయంలో పెర్ఫెక్ట్ గా ఉంటాడు. తన సినిమాలలో ఉన్న ప్రతి పాత్రకి కథలో ఏదో ఒక విధమైన ప్రాధాన్యత ఉంటుంది. అనవసరంగా క్యారెక్టర్స్ ని ఏదో గ్లామర్ షో కోసం పెట్టుకునే వ్యక్తి కాదు.

అందుకే కల్కి 2898 ఏడీ సినిమాలో కచ్చితంగా దిశా పటానికి మంచి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే క్యారెక్టర్ లభించి ఉంటుందనే మాట వినిపిస్తోంది. అలాగే గ్లామర్ పరంగా కూడా సినిమాకి అదనపు అస్సెట్ గా దిశా పటానికి ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా దిశా పటాని తెలుగులో చేస్తోన్న రెండో సినిమాలో ఏ మేరకు తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుందనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాలి.


Advertisement

Recent Random Post:

Arvind Kejriwal | కేజ్రీవాల్ ఇంటి నుంచి వెళ్లిపోతుంటే భావోద్వేగ వాతావరణం..

Posted : October 5, 2024 at 12:00 pm IST by ManaTeluguMovies

Arvind Kejriwal | కేజ్రీవాల్ ఇంటి నుంచి వెళ్లిపోతుంటే భావోద్వేగ వాతావరణం..

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad