గత ఏడాది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పఠాన్, జవాన్, డుంకీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 2500 కోట్లు వసూలు చేయడంతో తాను మాత్రమే బాక్సాఫీస్ కింగ్ ఎందుకో నిరూపించాడు. ఇటీవల కింగ్ ఖాన్ లైనప్ చూస్తే షాక్ తినాల్సిందే. క్రేజీ బ్యానర్స్, టాప్ డైరెక్టర్లతో ఎదురే లేని లైనప్ ని అతడు ప్లాన్ చేసాడు. అయితే అతడి లైనప్‌లో తెలుగు కుర్రాళ్లు, ప్రతిభావంతులైన రాజ్ అండ్ డీకే ముందు వరుసలో ఉన్నారు. స్త్రీ 2 మేకర్స్ తో పోటీపడుతూ వారు కింగ్ ఖాన్ ని లాక్ చేయాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
కింగ్ ఖాన్ ఇప్పటికే రెండు యాక్షన్-ప్యాక్డ్ సినిమాలను లాక్ చేసాడు. సిద్ధార్థ్ ఆనంద్ నిర్మాతగా, సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్ .. YRF స్పై యూనివర్స్ చిత్రం పఠాన్ 2 ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పూర్తి చేసుకుని స్వింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు యథావిధిగా షారుఖ్ ఖాన్ కింగ్ కోసం షూటింగ్ ప్రారంభించే ముందు 3-సినిమా లైనప్‌ని కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. షారుఖ్ ఖాన్ చాలా స్క్రిప్ట్‌లను చదువుతున్నాడు. వెంటనే మరొక స్క్రిప్టును లాక్ చేయాలని చూస్తున్నాడు. ప్రాధాన్యంగా నాన్ యాక్షన్ స్పేస్‌లో సినిమా చేయాలనేది ఆలోచన. ఇటీవలే స్త్రీ2తో బ్లాక్ బస్టర్ అందుకున్న అమర్ కౌశిక్ – దినేష్ విజన్ బృందంతో భారీ అడ్వెంచర్ చిత్రం కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. షారుఖ్ ఖాన్ గత కొన్ని నెలలుగా దాదాపు ప్రతి దర్శకుడిని కలిశాడు. అతడి కోసం ఎవరు ఎలాంటి స్టోరీ లైన్ సిద్ధం చేశారో వారి ఆలోచనలను కూడా విన్నాడు. కానీ ఏదీ అతడిని నిజంగా ఎగ్జయిట్ చేయలేదు. కానీ ఇప్పుడు అమర్ కౌశిక్ – దినేష్ విజన్‌ల స్ట్రీ 2 టీమ్‌తో చర్చలు జరుపుతున్నారు అని తెలిసింది.
అమర్ – దినేష్ విజన్.. SRK కోసం ఒక భారీ అడ్వెంచర్ ఫిల్మ్‌ని ప్లాన్ చేస్తున్నారు. పలు బ్యానర్ల కలయికలో ఈ సినిమా తెరకెక్కే వీలుంది. ఇది `స్ట్రీ` యూనివర్స్‌లో భాగం కాదు.. కానీ కొత్త కథ ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది. ఇప్పటికే వారి మధ్య రెండు మూడు సమావేశాలు జరిగాయి. షారుఖ్ ఖాన్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అతను సినిమా చేయడం లేదా చేయకపోవడంపై నిర్ణయం తీసుకునే ముందు రాబోయే నెలల్లో మరిన్ని చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. మడాక్ ఫిల్మ్‌ని పక్కన పెడితే, SRK వారి కామిక్ యాక్షన్ థ్రిల్లర్ కోసం రాజ్ అండ్ DKతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఎందుకంటే రాజ్ అండ్ డీకే వినిపించిన సబ్జెక్ట్‌కి షారూఖ్ ఇప్పటికే కనెక్ట్ అయ్యాడు. లొసుగులపై కొంచెం రీవర్క్‌కి లోబడి వారితో సినిమా చేయాలనుకుంటున్నాడు. అడ్వెంచర్ ఫిల్మ్, కామిక్ యాక్షన్ థ్రిల్లర్ కాకుండా, షారూఖ్ కొన్ని యాక్షన్ చిత్రాల కోసం దక్షిణాదికి చెందిన కొంతమంది మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఇంకా స్క్రిప్ట్ ఏదీ లాక్ అవ్వలేదు.
కింగ్ చిత్రాన్ని జనవరి-2025 లో ప్రారంభించి 2025 మధ్య నాటికి పూర్తి చేయవలసి ఉండగా, ఆదిత్య చోప్రా 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో పఠాన్ 2ని సెట్స్ పైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కింగ్ – పఠాన్ 2 షూటింగ్ షెడ్యూల్‌లు ఇప్పటికే లాక్ అయ్యాయి. ఇవన్నీ కాగితంపై ఉన్నాయి. షారూఖ్ రెండు యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ల మధ్య న్యూఏజ్ కమర్షియల్ చిత్రం కోసం పని చేయడమెలా అనేది అన్వేషిస్తున్నాడు. అతను ఈ సంవత్సరం చివరి నాటికి అమర్ కౌశిక్, రాజ్ అండ్ డీకేలలో ఎవరో ఒకరితో స్క్రిప్టును లాక్ చేసి ముందుకు వెళతాడని తెలుస్తోంది. పోటీ ఎంత ఉన్నా ఫ్యామిలీమ్యాన్ మేకర్స్ కచ్ఛితంగా షారూఖ్ ని లాక్ చేయాలని పంతంతో ఉన్నట్టు తెలిసింది.
పఠాన్ 2 గురించి వివరాల్లోకి వెళితే… ఫిబ్రవరి లేదా మార్చి 2025 నాటికి ఈ భారీ స్పై యూనివర్స్ సాగా కోసం దర్శకుడిని యష్ రాజ్ అధినేత ఆదిత్య చోప్రా లాక్ చేస్తారని భావిస్తున్నారు. అప్పటికి నిర్మాత తన రచయితల టీమ్ శ్రీధర్ రాఘవన్ – అబ్బాస్ టైరేవాలాతో కలిసి సినిమాకు సంబంధించిన రచనా పనిని పూర్తి చేస్తాడు. షారుఖ్ ఖాన్ -అమర్ కౌశిక్ – దినేష్ విజన్ కలయిక సాధ్యపడితే అది రూ. 500 కోట్ల క్లబ్‌లోని కీప్లేయర్స్ అసోసియేషన్ గా గుర్తించవచ్చు.