Advertisement

గుహ ఆలయంలో ఎన్టీఆర్.. ఆ హీరో వల్లే ఇదంతా..

Posted : September 2, 2024 at 9:45 pm IST by ManaTeluguMovies

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన కుటుంబంతో కలిసి కర్ణాటకలో పర్యటిస్తూ పలు ప్రాచీన దేవాలయాలను దర్శించుకున్నారు. ఆగస్టు 31న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఉడిపి శ్రీకృష్ణ మఠం సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వెంట ఆయన తల్లి, సతీమణి లక్ష్మి ప్రణతి కూడా ఉన్నారు. మంగళూరులో దిగిన ఎన్టీఆర్ కుటుంబాన్ని కన్నడ స్టార్ రిషభ్ శెట్టి స్వయంగా వచ్చి ఆత్మీయంగా స్వాగతం పలికాడు.

ఎన్టీఆర్ గత మూడు రోజులుగా కర్ణాటకలో పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రిషభ్ శెట్టి ఇంటి సమీపంలో ఉన్న కెరడి మూడగల్లు ప్రాంతంలోని కేశవనాథేశ్వర గుహ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయంలో స్వయంభువుగా కొలువై ఉన్న పరమేశ్వరుడి దర్శనం కోసం ఎన్టీఆర్ కుటుంబం సహా రిషభ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ కూడా వచ్చారు.

అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న ఈ ఆలయ సహజ సౌందర్యం ఎన్టీఆర్‌ను ఎంతో ఆకట్టుకుంది. ఈ పర్యటనకు సంబంధించిన వీడియోలను రిషభ్ శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకోవడంతో అవి వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ప్రశాంత్ నీల్, రిషభ్ శెట్టి కుటుంబాలు కలిసి గుహలోని పరమేశ్వరుడిని దర్శించుకున్న తీరు వీడియోలో హైలెట్ అయ్యాయి.

ఇక ఈ పర్యటన ద్వారా ఎన్టీఆర్ తల్లి ఉడిపి శ్రీకృష్ణ దేవాలయాన్ని చూడాలన్న కోరిక నెరవేరింది. షూటింగ్ నుండి కొద్దిగా విరామం తీసుకుని తారక్ తన తల్లితో కలిసి ఈ పర్యటనలో పాల్గొన్నాడు. రిషభ్ శెట్టి ఈ పర్యటనలో ఎన్టీఆర్ కుటుంబానికి అందించిన ఆత్మీయ సత్కారం అభిమానులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిషభ్ శెట్టిని ప్రశంసిస్తూ ఆయన సంస్కారానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. ఎన్టీఆర్ తల్లి, రిషభ్ శెట్టికి ఒకే గ్రామం కుందపురకు చెందినవారు. ఈ నేపధ్యంలో వారిద్దరూ కలిసి పలు దేవాలయాలను సందర్శించడంపై అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఈ నెల లోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఆ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అలాగే కర్నెట్5రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ సినిమాలు మంచి కలెక్షన్స్ అందుకుంటూ ఉంటాయి. దీంతో అక్కడ కూడా దేవర సినిమా ఈసారి భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకునే అవకాశం ఉంది.


Advertisement

Recent Random Post:

Prakasam Barrage Boat Incident : అండర్ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి – Full & Final

Posted : September 13, 2024 at 8:57 pm IST by ManaTeluguMovies

Prakasam Barrage Boat Incident : అండర్ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి – Full & Final

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad