Advertisement

గోల్డెన్ గ్లోబ్ వేడుకలో భారత సాంప్రదాయ కట్టు బొట్టు చూపిన ఆర్ఆర్ఆర్ టీమ్

Posted : January 11, 2023 at 10:45 pm IST by ManaTeluguMovies

సినీ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు కోరుకున్నట్లుగా ఆర్ఆర్ఆర్ నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో అవార్డు దక్కింది. కీరవాణి ఈ అవార్డును దక్కించుకున్నారు.

ఈ అవార్డు వేడుకకు రాజమౌళి.. కీరవాణి.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు సతీ సమేతంగా హాజరు అయ్యారు. వీరంతా కూడా సాంప్రదాయ భారతీయ కట్టుబొట్టులో కనిపించడం అందరిని ఆశ్చర్యపర్చింది. ముఖ్యంగా రాజమౌళి డ్రస్ అంతర్జాతీయ వేడుక లో పాల్గొన్న హాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షించిందని అంతా మాట్లాడుకుంటున్నారు.

రామ్ చరణ్ మరియు ఉపాసన కూడా చాలా కూల్ అండ్ ట్రెడీషనల్ లుక్ లో సందడి చేశారు. ముఖ్యంగా ఉపాసన చీర కట్టుతో అందరిని ఆకట్టుకుంది. రమా రాజమౌళి మరియు వల్లి గార్లు కూడా చీర కట్టులో సందడి చేశారు. కీరవాణి నల్లటి సాంప్రదాయ కాస్ట్యూమ్స్ లో కనిపించారు.

మొత్తానికి గోల్డెన్ గ్లోబ్ వేడుకలో ఆర్ఆర్ఆర్ టీమ్ భారతీయ సాంప్రదాయ కట్టుబొట్టులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. కీరవాణికి అవార్డును ప్రకటించిన వెంటనే యూనిట్ సభ్యులు అంతా కూడా గట్టిగా కేకలు పెడుతూ చప్పట్లు కొట్టారు.

ఇప్పుడు అందరి దృష్టి ఆర్ఆర్ఆర్ నాటు నాటు ఆస్కార్ స్టేజ్ పై కూడా ఇలాగే సందడి చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు.


Advertisement

Recent Random Post:

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Posted : June 28, 2024 at 1:30 pm IST by ManaTeluguMovies

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement