Advertisement

చిరుతో మ‌హేష్‌.. 15 నిమిషాలు

Posted : February 29, 2020 at 10:29 pm IST by ManaTeluguMovies

మొత్తానికి ఓ అరుదైన కాంబినేష‌న్‌ను తెలుగు తెర‌పై చూసే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉన్న‌ట్లుంది. మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌లిసి న‌టించే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టిస్తున్న సినిమాలో.. అనివార్య కార‌ణాల వ‌ల్ల రామ్ చ‌ర‌ణ్ చేయాల్సిన పాత్ర‌ను మ‌హేష్ బాబు ద‌గ్గ‌రికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

వంశీ పైడిప‌ల్లితో త‌న సినిమా క్యాన్సిల్ కావ‌డం, కొత్త సినిమా ప‌ట్టాలెక్క‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌టం.. చిరుతో క‌లిసి న‌టించ‌డం అన్ని ర‌కాలుగా మంచే జ‌రిగేలా ఉండ‌టం.. పాత్రతో పాటు పారితోష‌కం కూడా న‌చ్చ‌డంతో మ‌హేష్ దాదాపుగా ఈ సినిమా ఒప్పుకున్న‌ట్లే అంటున్నారు. ఇంకొన్ని రోజుల్లోనే దీనిపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఐతే ఈ చిత్ర యూనిట్ వ‌ర్గాల నుంచి మ‌హేష్ చేయ‌బోయే పాత్ర‌కు సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర విశేషాలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ పాత్ర నిడివి దాదాపు 25 నిమిషాలు ఉంటుంద‌ట‌. అందులో చిరు, మ‌హేష్ కాంబినేష‌న్ సీన్లు 15 నిమిషాల దాకా ఉండొచ్చ‌ని స‌మాచారం. ఒక సోలో ఫైట్ చేయ‌డంతో పాటు చిరుతో క‌లిసి మ‌హేష్ ఒక పాట‌లోనూ క‌నిపించే అవ‌కాశ‌ముంది. అన్నీ ఓకే అనుకుంటే నెల రోజుల దాకా కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది మ‌హేష్‌.

మ‌రి చిరు అండ్ కో మ‌హేష్‌ను ఓకే చేసిందో లేదో చూడాలి. ఐతే అల్లు అర్జున్ ఈ పాత్ర చేయాల‌ని చాలా ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ని.. చిరు, చ‌ర‌ణ్‌ల‌తో మాట్లాడుతున్నాడ‌ని.. దీంతో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు న‌డుస్తున్నాయ‌ని ఒక ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏ విష‌యం ఇంకో వారం లోపు తేలిపోతుంద‌ని అంటున్నారు.


Advertisement

Recent Random Post:
Advertisement