టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సంక్రాంతి సీజన్ కి రెండు మూడు అంతకు మించి సినిమాలు వస్తూ ఉంటాయి. కనీసం ఇద్దరు స్టార్ హీరోల సినిమాలైనా సంక్రాంతికి విడుదల అవ్వడం చాలా సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు సైతం సంక్రాంతికి విడుదల అవ్వడం జరుగుతుంది. 2024 సంక్రాంతికి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, వెంకటేష్ నటించిన సైంధవ్, నాగార్జున నటించిన నా సామి రంగ సినిమాతో పాటు తేజ, ప్రశాంత్ వర్మ ల హనుమాన్ సినిమా వచ్చింది.
బాలకృష్ణ, బాబీ కాంబోలో రూపొందుతున్న సినిమాను మాత్రం ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలని భావించారు. కానీ బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. దాంతో డిసెంబర్ లో అయినా సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ డిసెంబర్ లోనూ సినిమా విడుదల చేయడానికి సరైన సమయం లేదు. అందుకే 2025 సంక్రాంతికి బాలయ్య సినిమాను విడుదల చేయాలని బాబీ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే సంక్రాంతి కోసం కర్చీఫ్ వేసేందుకు రెడీ అయ్యారు. ముగ్గురు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
గత సంక్రాంతి సందర్భంగా యంగ్ స్టార్ హీరో ఒకరు కాగా, ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలతో పాటు, ఇద్దరు యంగ్ హ ఈరోలు సైతం ప్రేక్షకుల ముంఉదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ముగ్గురు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం దాదాపు కన్ఫర్మ్ అయింది. కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫైట్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆయా హీరోల ఫ్యాన్స్ మధ్య సినిమాల గురించి చర్చ మొదలు అయింది. ఈ ముగ్గురు సీనియర్ హీరోలు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతూ వస్తున్నారు. కనుక వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే కచ్చితంగా అదో అరుదైన ఘట్టం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.