Watch జేసీ బ్రదర్స్ కి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వార్నింగ్
జేసీ బ్రదర్స్ కి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వార్నింగ్
Advertisement
Recent Random Post:
బిగ్ బాస్ 8 : ఎలిమినేషన్ షాక్.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే..!
బిగ్ బాస్ సీజన్ 8 పై ఆడియన్స్ నుంచి విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే హౌస్ లో ఉన్న కన్నడ బ్యాచ్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి. వాళ్లు ఏం చేసినా ఆహా ఓహో అనడం.. తెలుగు వాళ్లు ఎంత కష్టపడినా సరే ఏదో ఒక మాటతో పొగిడి సైలెంట్ అయిపోవడం జరుగుతుందని ఆడియన్స్ గుర్తించారు. నాగార్జున కేవలం వాళ్లు ఇచ్చిన స్కిప్ట్ మాత్రమే చదువుతున్నాడని అంటున్నారు.
ముఖ్యంగా లాస్ట్ వీక్ రోహిణి మెగా చీఫ్ అయ్యేందుకు చాలా కష్టపడ్దది. ఆమెకు కచ్చితంగా హౌస్ నుంచి మంచి అప్లాజ్ అది కూడా హోస్ట్ నాగార్జున చెప్పి చేయించాలని ఆడియన్స్ అనుకున్నారు. కానీ రోహిణిని నాగార్జున ఒక్క మాటతో పొగిడి శనివారం ఎపిసోడ్ లో విష్ణు ప్రియ, రోహిణి గొడవ గురించి మాట్లాడారు. ఇక మరోపక్క గౌతం కృష్ణని నాగార్జున షటప్ అనడం కూడా బిగ్ బాస్ ఆడియన్స్ ని హర్ట్ అయ్యేలా చేసింది.
సీజన్ 7 లో పాల్గొన్న గౌతం తన ఆట తీరుతో మెప్పించాడు. ఐతే సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతం మొదటి నుంచి హౌస్ మెట్స్ మీద ఎటాకింగ్ మోడ్ లో ఉన్నాడు. ఐతే గతవారం పృధ్వి, గౌతం ల మధ్య జరిగిన గొడవలో గౌతం తన వాదన వినిపిస్తున్నాడు. ఐతే నాగార్జున మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దూరినందుకు గౌతం షటప్ నేను నీ హౌస్ మెట్ ని కాదని అన్నాడు నాగార్జున. ఆ కామెంట్స్ బయట ఉన్న గౌతం ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేసింది.
హోస్ట్ కూడా గౌతం కు ఎగైనెస్ట్ గా ఉన్నాడని అంటున్నారు. అంతేకాదు ఆదివారం ఎలిమినేషన్ కూడా పృధ్వి, యష్మి చివరి దాకా ఉండగా యష్మి ఎలిమినేట్ అయ్యింది. పృధ్వి మాత్రం సేఫ్ అయ్యాడు. పృధ్వి హౌస్ నుంచి వెళ్తాడని ఆడియన్స్ భావించారు. కానీ అతన్ని సేఫ్ చేశారు. ఈ ఎవిక్షన్ కూడా ఆడియన్స్ కు రుచించలేదు. మరి ఫైనల్స్ కు దగ్గరపడుతున్న ఈ టైం లో బిగ్ బాస్ షో మీద ఆడియన్స్ ఇలా నెగిటివిటీ పెంచుకోవడం షో రేటింగ్ మీద దెబ్బ పడేస్తుందని చెప్పొచ్చు.
గౌతం ని హోస్ట్ కూడా టార్గెట్ చేయడంతో అతని గ్రాఫ్ మరింత పెరుగుతుంది. ప్రస్తుతానికి టైటిల్ రేసులో నిఖి, గౌతం ఉన్నారు ఐతే రోహిణి మెగా చీఫ్ రేసులో చాటిన సత్తా చూసి ప్రేక్షకులు ఆమెను కూడా టాప్ 5 కి తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు.