Advertisement

‘జై హనుమాన్‌’ కోసం కాంతార..!

Posted : October 19, 2024 at 3:16 pm IST by ManaTeluguMovies

ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు సినిమాల్లో చిన్న సినిమా హనుమాన్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌ చరిత్రలో సంక్రాంతికి మరే సినిమా సాధించని వసూళ్లు హనుమాన్ సినిమా సాధించడం జరిగింది. పాన్ ఇండియా రేంజ్‌లో హనుమాన్‌ కి మంచి స్పందన వచ్చింది. అందుకే దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హనుమాన్ సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ ను రూపొందించే పనిలో ఉన్నాడు. జై హనుమాన్‌లోనూ తేజ సజ్జా ఉంటాడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇక హనుమాన్ పాత్ర ను పోషించేది ఎవరు అనేది ప్రస్తుతం అందరి మనసులో ఉన్న ప్రశ్న.

హనుమాన్‌ సినిమాలోనే ఆంజనేయుడి పాత్రను చూపించే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. పాత్రను అయితే చూపించారు కానీ ఆ పాత్రను పోషించింది ఎవరు అనేది చూపించలేదు. గ్రాఫిక్స్ తో మేనేజ్ చేశారు. కానీ జై హనుమాన్‌లో మాత్రం కచ్చితంగా ఆంజనేయుడి పాత్రను ఎక్కువ పరిధిలో చూపించబోతున్నారు. అందుకే ఆ పాత్రను గ్రాఫిక్స్‌లో కాకుండా నటుడితో చేయించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుంది అనే చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో జై హనుమాన్ కోసం కన్నడ స్టార్‌, కాంతార హీరో రిషబ్‌ శెట్టిని ఈ సినిమా కోసం సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న జై హనుమాన్ సినిమాలో రిషబ్‌ శెట్టి నటించడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయింది. కానీ హనుమంతుడి పాత్ర చేయబోతున్నాడా అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఒక వేళ కాంతార స్టార్‌ రిషబ్‌ శెట్టి హనుమంతుడి పాత్ర పోషిస్తే కచ్చితంగా ప్రేక్షకులకు కన్నుల విందు ఖాయం అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పటికే రిషబ్ శెట్టిని హనుమంతుడిగా గ్రాఫిక్స్ చేసి షేర్‌ చేస్తున్నారు. ఆ పోస్టర్స్ భలే ఉన్నాయి అంటూ కామెంట్స్ దక్కించుకుంటుంది.

రిషబ్‌ శెట్టి ప్రస్తుతాం కాంతార చాప్టర్‌ 1 సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. చాలా బిజీగా ఉన్నా ప్రశాంత్‌ వర్మ వర్కింగ్‌ స్టైల్‌ తో పాటు జై హనుమాన్‌ సినిమాకు సంబంధించిన కథను చెప్పడం వల్ల రిషబ్‌ శెట్టి నో చెప్పలేక పోయాడట. పాత్ర తో పాటు ప్రతి పాత్ర చుట్టూ అల్లిన కథను రిషబ్‌ శెట్టి మెచ్చి నటించేందుకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. జై హనుమాన్‌ లో రిషబ్ శెట్టి పాత్ర ఏది అయినా కన్నడ నాట ఈ సినిమాకు అత్యధిక ఆధరణ లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్ వర్మ యూనివర్శ్‌ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి క్రేజీ కాంబో మూవీస్ రాబోతున్నాయి. జై హనుమాన్‌లో మాత్రమే కాకుండా రిషబ్‌ శెట్టి మరిన్ని సినిమాలను ప్రశాంత్‌ వర్మతో కలిసి చేసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Recent Random Post:

Love Reddy Official Trailer | Anjan Ramachendra, Shravani | Smaran Reddy | Prince Henry

Posted : October 15, 2024 at 1:44 pm IST by ManaTeluguMovies

Love Reddy Official Trailer | Anjan Ramachendra, Shravani | Smaran Reddy | Prince Henry

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad