Advertisement

ట్రైల‌ర్ రిలీజ్ చేసినందుకు వోడ్కా ఇచ్చారు

Posted : March 10, 2020 at 3:34 pm IST by ManaTeluguMovies

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు, వోడ్కాకు ఉన్న బంధం గురించి కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎంత పెద్ద తాగుబోతులైనా త‌మ‌కున్న ఆ అల‌వాటు గురించి, తాము తాగే బ్రాండ్ల గురించి ఓపెన్‌గా మాట్లాడరు. కానీ త‌న రూటే సెప‌రేటు అన్న‌ట్లుగా ఉండే వ‌ర్మ.. త‌నకున్న‌ వోడ్కా అల‌వాటు గురించి చాలాసార్లు ఓపెన‌య్యాడు. ఆయ‌న మీద వోడ్కా విత్ వ‌ర్మ అంటూ ఓ పుస్త‌కం కూడా వ‌చ్చిన సంగతి తెలిసిందే. వ‌ర్మ వోడ్కా పిచ్చి గురించి ఆయ‌న శిష్య గ‌ణం అంద‌రికీ బాగా తెలుసు.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ప్రియ శిష్యుల్లో ఒక‌డైన జేడీ చ‌క్ర‌వ‌ర్తి కూడా త‌న సినిమా ఈవెంట్‌కు వ‌ర్మ‌ను పిలిచి వేదిక మీద‌ వోడ్కా బాటిల్ గిఫ్టుగా ఇచ్చాడు. జేడీ హీరోగా న‌టించిన కొత్త చిత్రం ఎంఎంఓఎఫ్ ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ఈ చిత్రం చోటు చేసుకుంది. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేసి వోడ్కా బాటిల్ గిఫ్టుగా పుచ్చుకున్నాడు వ‌ర్మ‌.

ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే.. ఎన్ఎస్‌సీ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్‌ను కొంచెం భిన్నంగానే క‌ట్ చేశారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి త‌ర‌హాలో ఇరుక్కుపోయిన హీరో ఆ ప‌ద్మ‌వ్యూహం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడనే నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. ఈ విష‌యాన్ని ట్రైల‌ర్లో కొంచెం కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు జేడీ.

అత‌డి న‌రేష‌న్‌తోనే ట్రైల‌ర్ న‌డిచింది. విజువ‌ల్స్ చాలా గంద‌ర‌గోళంగా, వ‌యొలెంట్‌గా ఉన్నాయి. ర‌క్త‌పాతం ఓ రేంజిలో ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి సినిమాను రిలీజ్ చేస్తార‌ట‌. వేస‌విలో ఎంఎంఓఎఫ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.


Advertisement

Recent Random Post:
Advertisement