ఎంతటి మెగాస్టార్ అయినా సమస్య తప్పలేదు. కళ్ల ముందు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. కానీ నిర్ణయం తెగడం లేదు. కొరటాల శివ డైరక్షన్ లో చేస్తున్న ఆచార్య సినిమా ఇప్పటికే లేట్ అయింది. ఎలాగైనా అయితే ఆగస్టులో లేదా అక్టోబర్ లో విడుదల చేయాల్సిందే. అందులో మరో థాట్ లేదు. ఆ మేరకు ఫిక్స్ అయిపోయారు.
కానీ సమస్య సినిమాలో తనతో పాటు రామ్ చరణ్ వుండాలా?
సూపర్ స్టార్ మహేష్ ను తీసుకోవాలా?
మెగాస్టార్ సినిమాలో చేయడానికి సూపర్ స్టార్ మహేష్ కు అభ్యంతరం లేదు. పైగా సినిమాకు దర్శకుడు కొరటాల శివ అంటే మహేష్ కు మంచి గౌరవం, అభిమానం, స్నేహం అన్నీ వున్నాయి. అదీ కాక మెగాస్టార్ ప్లస్ సూపర్ స్టార్ అంటే ఆ సినిమాకు వచ్చే బజ్ వేరు.
ఇదంతా ఒకవైపు..
కానీ మెగాస్టార్-మెగాపవర్ స్టార్ కలిసి సినిమా చేసే చాన్స్ మళ్లీ ఇప్పట్లో మళ్లీ వస్తుందో రాదో తెలియదు. తండ్రీ కొడుకులు పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమాగా ఆచార్య సినిమా రికార్డుల్లో పదిలంగా వుండిపోతుంది.
కానీ రామ్ చరణ్ నటిస్తే, సినిమాను ఈ ఏడాదిలో అది కూడా ఆర్ఆర్ఆర్ ముందుగా విడుదల అవుతుందా? దానికి రాజమౌళి పక్కాగా సై అంటారా? అన్నది ఓ అనుమానం. దానిలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ విషయంలో ఇప్పటి వరకు మెగాస్టార్-రాజమౌళి ముఖాముఖి మాట్లాడుకున్నట్లు వార్తలు లేవు.
ఇంతకుమించి మరో ముచ్చట వుంది
మహేష్ ను సినిమాలోకి తీసుకుంటే ఆయన ఫ్యాన్స్ ను దృష్టిలో వుంచుకోవాలి. ఎక్కడా ఎలివేషన్, ఇంపార్టెన్స్ తగ్గ కూడదు. కొరటాల కూడా ఆ విషయంలో కేర్ గా వుంటారు. అలాంటప్పుడు మెగా ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారు?
అదే సమయంలో మహేష్ కు పాతిక లేదా ముఫై కోట్ల రెమ్యూనిరేషన్ ఇవ్వాలి. జస్ట్ పాతిక లేదా ముఫై రోజులకు.
అదే కనుక రామ్ చరణ్ ను తీసుకుంటే.. ఎలివేషన్ ఎక్కువైనా తక్కువైనా ఇధ్దరూ మెగా హీరోలే.
పాతిక కోట్లు అయినా, ముఫై కోట్లు అయినా, అవి కూడా మళ్లీ మన ఇంట్లోకే చేరతాయి.
ఇలా రకరకాల ఆలోచనలు, డిస్కషన్లు. ఇంకోపక్క మహేష్ బాబుకు అమెరికాలో సర్జరీ అపాయింట్ మెంట్ వుందన్న వార్తలు. ఇవన్నీ కలిసి మెగాస్టార్ ను అలా డెసిషన్ మేకింగ్ లో కిందా మీదా అయ్యేలా చేస్తున్నాయి ఇప్పుడు.