దాదాపు 18 ఏళ్లుగా సౌత్ సినీ ఆడియన్స్ ని అలరిస్తూ స్టార్ ఫాం కొనసాగిస్తున్న భామ మిల్కీ బ్యూటీ తమన్నా. 2005లో శ్రీ సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ వచ్చింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన తమన్నా కెరీర్ మొదలు పెట్టి 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ అదే క్రేజ్ తో సినిమాలు చేస్తుంది.
కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో సినిమాకు భారీ రెమ్యునరేషన్ అందుకున్న తమన్నా ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంది. హీరోయిన్ గా 18 ఏళ్ల లాంగ్ కెరీర్ లో తమన్నా 16 మిలియన్ల ఆస్తులను సంపాదించుకుంది. అంటే మన కరెన్సీ లో చెప్పాలంటే దాదాపు 132 కోట్లు అన్నమాట. ఏడాదికి 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్న తమన్నా సినిమాలతో పాటుగా వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తుంది. ప్రకటనల కోసం తమన్నా 4 నుంచి 5 కోట్ల దాకా తీసుకుంటుందని తెలుస్తుంది.
సినిమాల్లో హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ తో కూడా తమన్నా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అలా స్పెషల్ సాంగ్ కోసం తమన్నా 60 నుంచి కోటి దాకా చార్జ్ చేస్తుందని తెలుస్తుంది. 2018 ఐపీఎల్ స్టార్టింగ్ ఈవెంట్ లో 10 మినిట్స్ పాట కోసం 50 లక్షల పారితోషికం అందుకుంది తమన్నా. ఫాంటా, మొబైల్ ప్రీమియర్ లీగ్, సెల్కాన్ మొబైల్స్, చంద్రిక లాంటి బ్రాండ్స్ కి తమన్నా బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తుంది.
తమన్నా ముంబైలోని 16.6 కోట్ల విలువైన జుహు అపార్ట్ మెంట్ లో నివసిస్తుంది. తమన్నాకు కార్లపై చెప్పలేనంత ఇష్టం ఉందట. అందుకే ఆమె దగ్గర 3, 4 మోడల్ కార్లు ఉంటాయి. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, బి.ఎం.డబల్యు 320i, మెర్సిడెస్ బెంజ్ జి.ఎల్.ఈ, మిట్సుబిషి పజెరో స్పోర్ట్ వంటి మోడల్ కార్లు తమన్నా దగ్గర ఉన్నాయి. ఇదే కాదు తమన్నా వార్డ్ రోబ్ లో 3 లక్షల విలువైన హై ఎండ్ ఛానల్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. తమన్నా వైట్ & గోల్డ్ అనే స్టోర్ ను బోల్డ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. తమన్న దూకుడు చూస్తుంటే మరో ఐదేళ్లు ఇదే ఫాం కొనసాగించేలా ఉంది. సీనియర్ హీరోయిన్స్ అంతా కూడా ప్రయోగాలు చేస్తున్న టైం లో తమన్నా కూడా అలాంటి ప్రయోగాలు చేయాలని చూస్తుంది. డిసెంబర్ 21 పుట్టినరోజు జరుపుకుంటున్న తమన్నా ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.