Advertisement

తార‌క్ పై అనుప‌మ్ ఖేర్ అభిమాన‌మంతా ఇలా!

Posted : May 1, 2024 at 8:39 pm IST by ManaTeluguMovies

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని అభిమానించ‌న‌ది..ఇష్ట‌ప‌డ‌నిది ఎవ‌రు? కోట్లాది మంది అభిమానులు ఆరాదిస్తున్న స్టార్ అత‌ను. ఓ సినిమా న‌టుడిగానే కాదు వ్య‌క్తిగ‌తంగా తార‌క్ ని ఆరాదించే వారెంతో మంది. అత‌డు రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరుకుంటున్న వారు ఎంత మంది ఉన్నారు. అభిమానుల ప‌ట్ల ఆయ‌న చూపించే శ్ర‌ద్ద‌..ఆయ‌న వ్యాఖ్య‌లు ఎంతో మంది మ‌న‌స్సుల్ని తాకాయి. ఎంత గొప్ప న‌టుడో అంత‌కుమించి గొప్ప వాక్చుత‌ర్యం ఉన్న‌వారు కూడా. తార‌క్ ఫాలోయింగ్ పెర‌గ‌డానికి అదీ ఓ కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు.

తాజాగా యంగ్ టైగ‌ర్ గురించి బాలీవుడ్ దిగ్గజం అనుప‌మ్ ఖేర్ త‌న మ‌న‌సులో మాట‌ల్ని బ‌య‌ట పెట్టారు. తార‌క్ నేను అభిమానించే వ్య‌క్తి. అలాగే అత‌ని న‌ట‌న ఎంతో ఇష్ట‌ప‌డ‌తాను. అత‌న్ని క‌ల‌వ‌డం చాలా ఆనందంగా ఉంది. గ‌త రాత్రే అత‌న్ని క‌లిసాను. అత‌ని ప‌నిని ఎంతో ఇష్ట‌ప‌డుతున్నాను. అత‌ని ఎన‌ర్జీ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. డే బైడే మరింత షైన్ అవుతాడు. జైహో అంటూ ట్విట‌ర్లో రాసుకొచ్చారు. తార‌క్ తో క‌లిసి దిగిన ఫోటోని కూడా ఫోటోని కూడా పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

తార‌క్ ముంబై లో అడుగు పెట్టిన నాటి నుంచి నెట్టింట ర‌చ్చ మామూలుగా లేదు. ఓ వైపు `వార్ -2` షూటింగ్ లో పాల్గొంటూనే బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తోనూ ఖాళీ స‌మ‌యంలో ఇంట‌రాక్ట్ అవుతున్నాడు. భార్య తో క‌లిసి ముంబై రెస్టార్లెంట్లు కూడా ప‌నిలో ప‌నిగా చుట్టేస్తున్నారు. అత‌డితో అభిమానులు అంతే ఉత్సాహంతో సెల్పీలు దిగేస్తున్నారు. ఇప్పుడే ఈ రేంజ్ తార‌క్ సంచ‌ల‌నం సృష్టిస్తుంటే `వార్ -2` రిలీజ్ అయి హిట్ అయితే అత‌డి మేనియా ముంబైలో ఇంకెలా ఉంటుందో ఊహ‌కి కూడా అంద‌నిదే.

ప్ర‌స్తుతం తారక్ తెలుగులో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `దేవ‌ర` లో కూడా న‌టిస్తోన్న‌సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియాలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ముందుకు రానుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచనాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.


Advertisement

Recent Random Post:

250 ఏళ్లనాటి సీసాల్లో-తాజాగా చెర్రీ, బెర్రీలు | Centuries-old Bottles of fruit Found Washington’s

Posted : June 19, 2024 at 2:55 pm IST by ManaTeluguMovies

250 ఏళ్లనాటి సీసాల్లో-తాజాగా చెర్రీ, బెర్రీలు | Centuries-old Bottles of fruit Found Washington’s

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement