Advertisement

త్రివిక్రమ్ సాయంతో నితిన్ కి ఆమె దొరికింది!

Posted : February 29, 2020 at 2:54 pm IST by ManaTeluguMovies

నితిన్ కి భీష్మ ఇచ్చిన ధైర్యంతో అంధాదున్ రీమేక్ కి కొబ్బరికాయ కొట్టేసాడు. ఈ చిత్రం రైట్స్ తీసుకుని చాలా రోజులు అవుతున్నా కానీ నితిన్ చేయాలా వద్దా అనే మీమాంసకు గురయ్యాడు.

భీష్మ కారణంగా తన మార్కెట్ మళ్ళీ మాములు అవడంతో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ రీమేక్ మొదలు పెడుతున్నాడు. అయితే ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించిన టబు స్థానంలో ఎవరు నటిస్తారనేది ఆసక్తి రేకెత్తించింది.

అనసూయ చేయవచ్చు అంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ టబు స్టేచర్ ఉన్న నటి కావాలని ఫిక్స్ అయి ఆమె కోసం ప్రయత్నిస్తే మళ్ళీ అదే పాత్ర చేయడానికి ఆమె అంతగా ఆసక్తి చూపించలేదట. దాంతో నితిన్ తన గురూజీ త్రివిక్రమ్ సాయం తీసుకున్నాడట.

టబుతో అల వైకుంఠపురం చేసిన త్రివిక్రమ్ చెప్పడంతో ఆమె ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తుంది. పారితోషికం, డేట్స్ వగైరా తేలిపోతే ఈ వార్త అధికారికం అవుతుంది.


Advertisement

Recent Random Post:
Advertisement