Advertisement

దర్శకేంద్రుడి కొడుకుతో అనుష్క పెళ్లి???

Posted : March 13, 2020 at 6:19 pm IST by ManaTeluguMovies

అనుష్క పెళ్లి గురించి వచ్చినన్ని వార్తలు మరే హీరోయిన్‌ పెళ్లి గురించి.. మరో సెలబ్రెటీ పెళ్లి గురించి వచ్చి ఉండవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అనుష్క మిర్చి సినిమా చేస్తున్నప్పటి నుండి అంటే దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాలుగా అనుష్క పెళ్లి పుకార్లను ఎదుర్కొంటూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆ వార్తలను కొట్టి పారేస్తూనే వచ్చింది. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌, అనుష్కల వివాహం జరుగబోతుందని ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు కూడా వార్తలు రాశాయి.

ప్రముఖ మీడియా సంస్థలు కూడా అనుష్క పెళ్లికి సంబంధించిన అనేక పుకార్లను ప్రచారం చేశాయి అంటే ఏ స్థాయిలో ఆమె పెళ్లి పుకార్లు వచ్చాయో చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు ఒక క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్‌ కోవెల మూడితో అనుష్క వివాహం అంటూ కూడా ప్రచారం మొదలైంది. ప్రకాష్‌ కోవెలమూడి కొన్నాళ్ల క్రితం భార్య నుండి విడాకులు తీసుకున్నాడు.

విడాకుల తీసుకున్న వ్యక్తితో తన వివాహం అంటూ మీడియాలో వచ్చిన వార్తలు ఆమెకు తీవ్రంగా అసహనంకు గురి చేశాయట. ఒక ఇంగ్లీష్‌ పత్రికతో మాట్లాడిన అనుష్క ప్రకాష్‌ కోవెలమూడితో తన పెళ్లి వార్తలు అంటూ ఎలా రాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాకు కుటుంబ సభ్యులు ఉంటారు, వారు ఇలాంటి వార్తల వల్ల సఫర్‌ అవుతారు అనే కనీస జ్ఞానం ఉండదా అంటూ ప్రశ్నించింది. మొత్తానికి పెళ్లి వార్తలు అన్ని కూడా పుకార్లే అని క్లారిటీ ఇచ్చింది. తాజాగా అనుష్క తన 15 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకుంది. ఇక నిశబ్దం చిత్రంతో వచ్చే నెలలో అనుష్క ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Advertisement

Recent Random Post:

పల్నాడు లో హై టెన్షన్..నాటుబా*బుల స్వాధీనం | High Tension In Palnadu

Posted : May 16, 2024 at 9:10 pm IST by ManaTeluguMovies

పల్నాడు లో హై టెన్షన్..నాటుబా*బుల స్వాధీనం | High Tension In Palnadu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement