Advertisement

దేవర సైలెన్స్ వెనుక రీజన్ అదేనా..?

Posted : September 7, 2023 at 10:22 pm IST by ManaTeluguMovies

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR తర్వాత చేస్తున్న దేవర సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. యువ సుధ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న దేవర సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో తారక్ తో బాలీవుడ్ అందాల భామ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది.

రీసెంట్ గా శంషాబాద్ లో భారీ యాక్షన్ పార్ట్ షూట్ జరుపుకున్న దేవర సినిమా త్వరలో మరో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా ఎలాంటి అప్డేట్స్ కూడా బయటకు రాకుండా చేస్తున్నారు. కొరటాల శివ సినిమా గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఒక్క ఫోటో కూడా బయటకు రాకూడదని అనుకుంటున్నాడు. అదేవిధంగా షూటింగ్ స్పాట్ కి 24 క్రాఫ్ట్ కు సంబంధించిన ఎవరు కూడా సెల్ ఫోన్లు లేకుండా షూటింగ్ లో పాల్గొనేలా చేస్తున్నారట.

దేవర సినిమా తో తారక్ కి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని కొరటాల శివ అద్భుతమైన ప్లానింగ్ లో ఉన్నారు. సినిమా నుంచి ఎలాంటి లీక్స్ లేకుండా ఒకేసారి టీజర్ తో సినిమా రేంజ్ చూపించాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే దేవర ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా టీజర్ కూడా వస్తే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. సినిమా నుంచి వదిలే ప్రచార చిత్రాల గురించి కూడా కొరటాల శివ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారట.

ఆచార్య షాక్ తో తన కెరీర్ లో ఎప్పుడూ చూడని బ్యాడ్ ఫేజ్ చూసిన కొరటాల శివ దేవరతో తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమాగా దేవర భారీ రికార్డుల టార్గెట్ తో వస్తుంది. మరి ఈ సినిమా మీద పెట్టుకున్న అంచనాలు ఏమేరకు నిజం అవుతాయన్నది చూడాలి. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేసిన దేవర అనుకున్న టైం కు రిలీజ్ చేసేలా పక్కా ప్రణాళికతో షూటింగ్ నిర్వహిస్తున్నారు. దేవర స్పెషల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ లో ఉన్నారు. దసరాకి టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.


Advertisement

Recent Random Post:

అధైర్య పడాల్సిన అవసరం లేదు..కష్టాలు శాశ్వతం కాదు: YS Jagan To YSRCP Leaders

Posted : November 11, 2024 at 9:10 pm IST by ManaTeluguMovies

అధైర్య పడాల్సిన అవసరం లేదు..కష్టాలు శాశ్వతం కాదు: YS Jagan To YSRCP Leaders

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad