Advertisement

నాని మీదికే తొడ కొట్టేస్తున్నాడే..

Posted : March 10, 2020 at 6:30 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ మేల్ యాంక‌ర్ల‌లో ప్ర‌దీప్ మాచిరాజు నంబ‌ర్‌వ‌న్ అన‌డంలో మ‌రో మాట లేదు. సొగ‌స‌రి అత్త గ‌డ‌స‌రి కోడ‌లు ప్రోగ్రాంతో పాపుల‌ర్ అయిన అత‌ను.. ఆ త‌ర్వాత కొంచెం ట‌చ్‌లో ఉంటే చెప్తాను స‌హా కొన్ని షోల‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ ఫాలోయింగ్‌తో హైద‌రాబాద్ మోస్ట్ వాంటెడ్ మెన్ జాబితాలో టాప్‌లో నిలిచే స్థాయికి చేర‌డం విశేష‌మే. ఇప్పుడ‌త‌ను హీరోగా కూడా మారాడు.

ప్ర‌దీప్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా.. 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా? మున్నా అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ అమ్మాయి అమృత క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సిద్ శ్రీరామ్ పాడిన‌ నీలి నీలి ఆకాశం పాట‌తో ఈ సినిమాకు ఓ మోస్త‌రుగానే బ‌జ్‌ వ‌చ్చింది.

కానీ ఈ బ‌జ్ చూసి చిత్ర బృందం ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఓ క్రేజీ సినిమాకు పోటీగా త‌మ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మైపోయింది. ఈ నెల 25న ఉగాది కానుక‌గా నాని-సుధీర్ బాబుల సినిమా వి రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ రూపొందించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కు ట్రేడ్ వ‌ర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. వేస‌విలో వ‌స్తున్న తొలి పెద్ద సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు కూడా దీనిపై ఆస‌క్తితో ఉన్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్ర‌మిది.
అలాంటి సినిమాకు పోటీగా ప్ర‌దీప్ తొలి చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకోవ‌డం సాహ‌స‌మే.

ఐతే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ది గీతా ఆర్ట్స్-యువి క్రియేష‌న్స్ సంస్థ‌లు కావ‌డం విశేషం. దిల్ రాజు సినిమా మీదికి వీళ్లు త‌మ చిత్రాన్ని పోటీగా వ‌దులుతుండ‌టం ఆశ్చ‌ర్య‌మే. మ‌రి నాని సినిమా ధాటిని త‌ట్టుకుని ప్ర‌దీప్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.


Advertisement

Recent Random Post:
Advertisement