ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా పల్లవి ప్రశాంత్ నీల్ గురించి చర్చ జరుగుతుంది. ఒక రైతు బిడ్డ గా కామన్ మ్యాన్ కేటగిరి కింద బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అందరినీ మెప్పించాడు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ తానొక రైతు బిడ్డ అని చెబుతూ ఆడియన్స్ లో ఒక సింపతీ క్రియేట్ చేశాడు. అయితే ఆ సింపతీకి తోడు అతని ఆట తీరు కూడా నచ్చి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు.
బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ ఆ ఆనందం లేకుండానే ఇప్పుడు చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. ఫైనల్ ఎపిసోడ్ తర్వాత హైదరాబాద్ రోడ్ల మీద ప్రశాంత్ సపోర్టర్స్ చేసిన విధ్వంసానికి అతను కూడా ఒక కారణమని పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు. పల్లవి ప్రశాంత్ మీద మొత్తం 9 సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రశాంత్ తో పాటుగా అతని సోదరుడు రాజుపై కూడా పోలీసులు కేసు పెట్టారు.
బిగ్ బాస్ హౌస్ నుచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ కు పోలీసులు చెప్పిన మాటలని వినకపోవడం వల్లే తను ఇప్పుడు జైలుపాలవ్వాల్సి వచ్చింది. క్రౌడ్ ఎక్కువగా ఉంది కంట్రోల్ చేయడం కష్టమవుతుందని భావించిన పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనక గేట్ నుంచి వెళ్లాలని చెప్పారట. కానీ పల్లవి ప్రశాంత్ అందుకు ఒప్పుకోలేదు. తనౌ దొంగలా వెనక నుంచి వెళ్లాల్సిన అవసరం ఏముందని వారితో వాదించాడు. అలా ఫ్రంట్ గేట్ నుంచి వచ్చిన ప్రశాంత్ ఈ విధ్వంసానికి కారణమయ్యాడు.
అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చాక అంతమంది తన సపోర్టర్స్ ని చూసిన పల్లవి ప్రశాంత్ కాస్త ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. వేలామంది అభిమానులకు సర్ధి చెప్పాల్సింది పోయి వాళ్లతో కలిసి ర్యాలీ తీసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఎంత చెప్పినా సరే రోడ్ల మీద ఫ్యాన్స్ ని కలిసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సులు, కార్ల మీద ఎటాక్ చేశారు. ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాల్సి వచ్చింది.
పోలీసులు చెప్పడంతో కొంతదూరం హడావిడి చేసి తన ఇంటికి వెళ్లిన పల్లవి ప్రశాంత్ పై అప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్లి అతన్ని విచారణ కోసం పోలీసులు అతన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ కి తీసుకెళ్లారు. పోలీసులు చెప్పింది అర్థం చేసుకోలేకపోయానని అరెస్ట్ ముందు మీడియాతో మాట్లాడాడు. అయితే తనను మానసికంగా ఇబ్బంది పెట్టిన ఐదుగురు ఫోటోలు బయట పెడతానంటున్నాడు పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. కేసు విషయంలో తర్వాత ఏం జరుగుతుంది అన్నది చూడాలి.