Advertisement

పవన్ కు పొలిటికల్ బూస్ట్.. స్ట్రాంగ్ టీజర్ రెడీ!

Posted : March 16, 2024 at 6:16 pm IST by ManaTeluguMovies

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్నారు జనసేనాని. దీంతో తాను ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలన్నింటినీ పక్కన పెట్టేశారు పవన్. అన్ని ప్రాజెక్టులకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఎన్నికల తర్వాత సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి.

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా తక్కువ రోజులు మాత్రమే జరిగింది. పవన్ బిజీ అవ్వడంతో బ్రేక్ పడింది. దీంతో హరీష్ శంకర్.. రవితేజతో సినిమా చేస్తున్నారు. హిందీ రైడ్ రీమేక్ గా మిస్టర్ బచ్చన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే.. రాజకీయాల్లో పవన్ ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో ఉస్తాద్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇప్పటికే జరిగిన షూటింగ్ పార్ట్ లో పవన్.. పోలీస్ పాత్రలో ప్రభుత్వంపై వేసిన కొన్ని కౌంటర్ డైలాగ్స్ ఉన్నాయట. వాటితో ఒక డైలాగ్ టీజర్ కట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఈ కొత్త టీజర్.. పవన్ రాజకీయాలకు మంచి బూస్టప్ ఇవ్వనుందట. ప్రస్తుతం ఏపీలో పవన్ పెద్ద ఎత్తున రాజకీయ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే టైంలో డైలాగ్ టీజర్ రిలీజ్ చేస్తే పవన్ ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపొచ్చని మేకర్స్ అనుకుంటున్నారట.

మరోవైపు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారట మేకర్స్. అయితే ఇంకొందరు.. ఉస్తాద్ డైలాగ్ టీజర్ రెడీ అవుతుందని, ఇదే నిజమేనని చెబుతున్నారు. కానీ ఎన్నికల సంబంధించినది కాదని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Advertisement

Recent Random Post:

హైడ్రాపై హైకోర్టు సీరియస్: Telangana High Court Serious On Hydra Demolitions | Ranganath

Posted : September 30, 2024 at 2:09 pm IST by ManaTeluguMovies

హైడ్రాపై హైకోర్టు సీరియస్: Telangana High Court Serious On Hydra Demolitions | Ranganath

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad