తారక్ నటిస్తున్న సినిమాల మేకర్స్ కూడా స్పెషల్ అప్డేట్స్ ఇచ్చారు. దేవర మూవీ నుంచి ఫియర్ సాంగ్ ను ఒకరోజు ముందుగానే మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ తో జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా షూటింగ్ అప్డేట్ ను అనౌన్స్ చేశారు ఆ మూవీ మేకర్స్. తారక్ బాలీవుడ్ డెబ్యూ వార్-2 ప్రాజెక్ట్ నుంచి కూడా స్పెషల్ పోస్టర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆ సినిమా మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులతో పాటు బీటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా విషెస్ తెలిపారు. అయితే తారక్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ కు పవన్ బర్త్ డే విషెస్ చెప్పడంతో పవర్ స్టార్ అభిమానులతో పాటు మ్యూచువల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎంతో సంతోషించారు.
ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు తారక్ పై కొందరు పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తనకు విషెస్ చెప్పిన సెలబ్రిటీలందరికీ ఎన్టీఆర్ రీసెంట్ గా రిప్లై ఇచ్చారు. కానీ జనసేన పార్టీ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్ కు మాత్రం స్పందించలేదు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్.. కావాలనే తారక్ JSP ట్వీట్ కు రిప్లై ఇవ్వలేదని కామెంట్లు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని, అందరికీ రిప్లై ఇచ్చి ఒక్క పోస్ట్ కు ఎందుకు అలా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే వాటికి తారక్ ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం అందరికీ తెలుసని అంటున్నారు. పవన్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ వచ్చి ఉంటే.. పక్కాగా తారక్ రిప్లై ఇచ్చేవారని చెబుతున్నారు. జనసేన హ్యాండిల్ నుంచి పోస్ట్ రావడంతో జస్ట్ మిస్ అయ్యి ఉంటారని అంటున్నారు.
ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అందుకే పొలిటికల్ పార్టీ నుంచి వచ్చిన ట్వీట్ కు స్పందించకపోయి ఉంటారని మరికొందరు చెబుతున్నారు. అసలు ఈ డిస్కషనే వేస్ట్ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.